
JAI TELANGANA (1969 - 2009)
by S.VENUGOPAL
₹75
In stock · 8 available
PublisherSUDHA PRACHURANALAYAM
LanguageTelugu
ముందు మాట రాష్ట్రం యివ్వాళ మండిపోతోంది. ఇది కాక ఆకాశంలో చందమామ మబ్బులచాటులో దాక్కుని సరదా చూస్తున్నాడు. మబ్బులచాటున దాగిన చందమామ చాటునుంచి వస్తాడో, కాటు వేస్తాడో తెలియని పరిస్థితి. యిటువంటి పరిస్థితి ప్రపంచంలో మరే రాష్ట్రనికిగాని, రాజ్యానికిగాని రాకపోయి వుండవచ్చు. అయినప్పటికి యిటువంటి పరిస్థితిలో రచయిత అయిన శ్రీ యస్. వేణుగోపాల్ గారు ధైర్యంచేసి యీనాడున్న పరిస్థితులు మారాలని మనసావాచా ఆలోచించడమే కాక, రాష్ట్రనికి పట్టిన దశనుంచి బయటికి రావాలని, దశదిశలా మారుమోగేలా ఘంటారావాన్ని పూరించడానికి పూనుకున్నారు. యిది అత్యంత సాహసోపేతమైన నిర్ణయంగా భావించాల్సిన అవసరం ఎంతయినా వుంది. రచయిత చేస్తున్న యుద్ధంలో అతడు ఏకాకి కాదని, కాకూడదని ఆశించడంలో ఎటువంటి తప్పువుండకపోవచ్చు. యీకారణంగా నేను రచయితకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను. ఆవశ్యకం. రచయిత గొప్పతనం యిక్కడ చర్చించడం అత్యంత మొట్ట మొదటిసారి ఆంధ్రప్రదేశ్ దిక్కుదివాణం లేని పరిస్థితి ఎదుర్కొని, ఆనాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని సమాప్తం చేయగలగడంలో యిటువంటి రచయితల పాత్ర తప్పక వుండి తరుతుంది. రచయిత 1969 లోనే, అంటే రచయిత చిన్నవయస్సులోనే 'ఆంధ్ర' అన్న పదం ఒక ప్రాంతానికి అన్వయించరాదని, దీనివల్ల రాష్ట్రం కష్టాలను ఎదుర్కోవాల్సివుంటుందని కోరారు. కానీ, అది ఎవరి దృష్టిని ఆకర్షించలోకపోయింది.