
JAILU LOPALA KATHALU
₹80
In stock · 12 available
PublisherVattikota Alwar Swamy
LanguageTelugu
వట్టికోట ఆళ్వారుస్వామి మొదట్లో రచించిన కథల కన్నా 'జైలు లోపల' కథలు భాష, శైలిలో, కథనం, కథన శిల్పంలో ఉత్కృష్ట మైనవి. అంటే ఆయన కథా రచనలో చేసిన సాధన, కథన శిల్పంలోని ప్రస్థానం తెలుగు సాహిత్యంలో కొన్ని ఉత్తమమైన, అపురూపమైన కథలను సృష్టించాయి. తెలుగు సాహిత్యానికి గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. ఆయన నవలల్లోగాని, కథల్లోగాని వాస్తవికతకు తగిన సరళ సులభ భాషాశైలిని ప్రయోగించాడు. ఆయన వస్తువును ఎంత సరళంగా మన ముందుంచుతాడో శైలి కూడా అంతే సరళంగా వుంటుంది. ఒక వంటలవాడుగా హోటల్ సర్వరుగా, ఫ్రూఫెడరుగా సామా న్యునిగా జీవితం ఆరంభించిన వట్టికోట కమ్యూనిస్టు పార్టీలో సభ్యునిగా ఉద్యమకారునిగా గొప్ప సాహిత్య సృష్టికర్తగా రూపొందాడు. ఒక నవలాకారునిగా, కథల రచయితగా, వ్యాస రచయితగా, పత్రికా నిర్వాహకుడుగా, గ్రంథాలయ నిర్మాతగా తెలుగు సాహిత్యంలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాడు.