JAILU LOPALA KATHALU - 60 by Vattikota Alwar Swamy Telugu book cover

JAILU LOPALA KATHALU - 60

by Vattikota Alwar Swamy

₹60
In stock · 23 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
JAILU LOPALA KATHALU - Vatti Kota Alwarswamy వట్టికోట ఆళ్వారుస్వామి నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ సమీపాన గల 'మాధవరం' అనే గ్రామంలో 1 నవంబర్, 1915న నిరుపేద శ్రీవైష్ణవ బ్రాహ్మణ దంపతులు శ్రీమతి సింహాద్రమ్మ, శ్రీమాన్ రామచంద్రాచార్యులకు జన్మించాడు. స్వయంకృషితో చదువుకొని విజ్ఞానవంతుడై గొప్ప రచయితగా సాహిత్యంలో స్థానం పొందాడు. అదే క్రమంలో ప్రజా ఉద్యమాల్లో పాల్గొని 'ప్రజల మనిషి'గా ఎదిగాడు. వట్టికోట ఆళ్వారుస్వామి రచయితగా, ఉద్యమకారుడిగా సమానంగా కృషి చేసాడు. సరళ హృదయుడైన వట్టికోట ఏ పని చేసినా అంకితమై చిత్తశుద్ధి, నిజాయితీలతో చేసాడు. గ్రంథాలయోద్యమంలో పాల్గొన్నాడు. గ్రంథమాలను స్థాపించి సాహిత్య ప్రచురణలు చేసి పాఠకులను పెంచాడు. సాహిత్యాసక్తిని కలిగించాడు. ఒక వంటలవాడుగా హోటల్ సర్వరుగా, ప్రూఫెడరుగా, సామాన్యునిగా జీవితం ఆరంభించిన వట్టికోట కమ్యూనిస్టు పార్టీలో సభ్యునిగా ఉద్యమకారునిగా గొప్ప సాహిత్య సృష్టికర్తగా రూపొందాడు. తెలంగాణలో ఆయన పాల్గొనని ఉద్యమం లేదు. వట్టికోట ఆళ్వారుస్వామి మొదట్లో రచించిన కథల కన్నా 'జైలు లోపల' కథలు భాష, శైలిలో, కథనం, కథన శిల్పంలో ఉత్కృష్టమైనవి. అంటే ఆయన కథా రచనలో చేసిన సాధన, కథన శిల్పంలోని ప్రస్థానం తెలుగు సాహిత్యంలో కొన్ని ఉత్తమమైన, అపురూపమైన కథలను సృష్టించారు. అవి తెలుగు సాహిత్యానికి గౌరవాన్ని తెచ్చి పెట్టాయి. ఆయన నవలల్లోగాని, కథల్లోగాని వాస్తవికతకు తగిన సరళ సులభ భాషాశైలిని ప్రయోగించాడు. ఆయన వస్తువును ఎంత సరళంగా మన ముందుంచుతాడో శైలి కూడా సరళంగా వుంటుంది. నవలాకారునిగా, కథల రచయితగా, వ్యాన రచయితగా, పత్రికా నిర్వాహకుడుగా, గ్రంథాలయ నిర్మాతగా తెలుగు సాహిత్యంలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాడు. తన తరాన్నీ తన తరువాతి తరాలనూ ప్రభావితం చేసిన తెలంగాణా విమోచనోద్యమ కథా రచయిత ఆళ్వార్ స్వామి జీవితం, సాహిత్యం, వ్యక్తిత్వం స్ఫూర్తిదాయకం, చిరస్మరణీయం. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ - 520 004