JAITRA YATRA by SRINIVAS MIRTHIPATI Telugu book cover

JAITRA YATRA

by SRINIVAS MIRTHIPATI

₹45
In stock · 21 available
PublisherSRINIVAS MIRTHIPATI
LanguageTelugu
ప్రాక్తిత్వ వికాసమే శ్రీరాముని జైత్రయాత్ర -ప్రజాకవి డాక్టర్ అద్దేపల్లి రామమోహనరావు రామాయణాన్ని పురాణంలా కాకుండా ఒక మానవేతిహాసంగా అధ్యయనం చేస్తే, మానవ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన రహస్యా అన్నీ అవగాహనకు వస్తె. శ్రీరాముని పాత్రను పరిశీలిస్తే మానవ సంబంధాలు ఎలా ఉండాలో, ప్రతి సంఘటనలోనూ వ్యక్తమౌతై. మిర్తిపాటి శ్రీనివాస్ వ్యక్తిత్వ వికాసరంగంలో సమగ్రమైన కృషి చేస్తూ, ఉత్తమ గ్రంథాలు రచిస్తున్న రచయిత.. ఇంతకుముందు 'గుణ' అనే గ్రంథాన్ని రాసి అందరి ప్రశంసలూ పొందారు. ఇప్పుడు రామాయణంలోని రాముని పాత్రను క్షుణ్ణంగా పరిశీలించి, జైత్రయాత్ర అనే గ్రంథాన్ని వెలువరిస్తున్నారు. శీర్షికలోనే మంచి అర్థం ఉంది. శ్రీరాముని పాత్ర లక్షణాల్ని అవగాహన చేసుకుంటే, అన్ని లోకాలు జయించవచ్చు అనేది రచయిత అభిప్రాయం. శ్రీనివాస్ శైలిలో ప్రజారంజకత్వం అత్యుత్తమ స్థాయిలో ఉంటుంది. రామాయణం గూర్చి వాస్తున్నాడు కాబట్టి.. ఏదేదో సంప్రదాయ భావాల్నీ, భాషనీ రాస్తాడనుకోనక్కర్లేదు. అత్యంత ఆధునికమైన భాష. ఎన్నో ఆధునిక సంఘటనలు, కథలు, కళ్లముందు కనిపించే సాంకేతిక విషయాలు, అంతేగాక హాస్యం, వ్యంగ్యం, వ్యక్తిత్వ వికాస శాస్త్ర సంబంధిత సిద్ధాంతాలు, ఇలా ఎన్నెన్నో సముచితమైన శైలిలో మిళితమై సాగిపోతూ ఉంటుంది. శ్రీనివాస్ కేవలం వ్యక్తిత్వ వికాసశాస్త్ర నిపుణుడు మాత్రమే కాదు.. చాలా అనుభవం ఉన్న జర్నలిస్టు.. అతను రాసే ప్రతిరచనలో ఒక ఆత్మ తిరుగుతుంటుంది. అది జర్నలిజం భావాత్మ.. 'నేనంత గొప్పవాణ్ని కాదు' అంటూ ఆయన చెప్పిన ఈ మాటలు చూడండి.. తరతరాలుగా రామాయణంలో పేరుకుపోయిన అపోహలు తొలగించేటంతటి గొప్పవాణ్ని కాదు.. కానీ యుద్ధానికి వెళ్లేటప్పుడు మా అమ్ములపొదిలో ఒక బ్రహ్మాస్త్రం ఉంటుంది. దానిపేరు జర్నలిజం.. శోధించడమే దాని పని.. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అని దానికో పేరుంది..' తన జర్నలిజం నేపథ్యంతో పురాణమనుకునే రామాయణాన్ని కూడా సమకాలీన సామాజిక రాజకీయ రూపంలో వివరించగలిగాడు. శ్రీరాముణ్ని మనకంటే వేరైన వ్యక్తిగా గాక.. మన మధ్యే తిరుగుతున్న ఉత్తమ వ్యక్తిగా చిత్రిం చగలిగాడు.