JALA DEEPIKA by N.GOPI Telugu book cover

JALA DEEPIKA

by N.GOPI

₹50
In stock · 6 available
PublisherN.GOPI
LanguageTelugu
సంపాదక వాక్యం ఇది జలగీతం రెండవ ముద్రణ సందర్భం. నవంబరు 18, 2007న డా॥ ఆవంత్స సోమసుందర్ గారి 84వ జన్మదినోత్సవం జరిగింది (సహస్రచంద్ర దర్శనం). ఆ సందర్భంగా డా॥ సోమసుందర్ లిటరరీ ట్రస్ట్, పీఠాపురం వారు ఎన్. గోపి గారు రచించిన 'జలగీతం' కావ్యానికి మాతృశ్రీ రాజహంస కృష్ణశాస్త్రి కవితా పురస్కారం ప్రదానం చేశారు. అప్పుడు తెలిసింది జలగీతం తొలి ముద్రణ కాపీలన్నీ అయిపోయా యని. అవార్డు ద్వారా లభించిన ఐదువేల రూపాయలతో రెండవ ముద్రణకు శ్రీకారం చుట్టడం జరిగింది. జలగీతం వెలువడి ఐదేళ్లు దాటిన సన్నివేశంలో దానిపై ఇంతవరకూ వచ్చిన విమర్శ సాహిత్యాన్ని ఒక సంకలనంగా వేస్తే బాగుంటుందనే సంకల్పం కలిగింది. ఆ ప్రయత్న ఫలితమే ఈ 'జలదీపిక'. ఈ గ్రంథంలో డా|| సోమసుందర్ గారివే రెండు పెద్ద వ్యాసాలున్నాయి. ఈ కావ్యం పట్ల వారికి గల సీరియస్నెస్ను ఇవి తెలియజేస్తాయి. అట్లాగే ప్రముఖ విమర్శకులు, సమీక్షకులు జలగీతంపైన చక్కని విశ్లేషణలం దించారు. వారికి మా కృతజ్ఞతలు. ఇందులోని రచనలన్నింటిని ప్రచురించిన ఆయా పత్రికా సంపాదకులకు మా ధన్యవాదాలు. అలాగే విజయనగరం, బాపట్ల పట్టణాల్లో జరిగిన జలగీత కావ్యపఠన కార్యక్రమాలు స్మరణీయ సంఘటనలుగా నిలిచిపోతాయి. ఈ సందర్భంగా వాటిని ఏర్పాటు చేసిన డా|| ఎ. గోపాలరావు, డా|| కె.వి.ఎస్. ఆచార్య గార్లకు మా అభినందనలు. ఇప్పటికే జలగీతం మరాఠి, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ, గుజరాతీ బాషల్లోకి అనువదింపబడి ఆయా రాష్ట్రాల్లో ఆవిష్కరణలు జరిగాయి. అంతేకాక కన్నడం, మలయాళం, ఒరియా, పర్షియన్ భాషల్లో ముద్రణకు సిద్ధంగా వుంది. అలాగే ధార్వాడ్, తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో ఎం.ఏ.కు పాఠ్యగ్రంథంగా నిర్ణయింపబడింది. ఒకటి, రెండు విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి జలగీతంపైన జరిగిన వివేచన అందరికీ అందుబాటులో వుండాలని మాకనిపించింది. ఈ ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని భావిస్తున్నాము.