
JALA JOODAM
₹20
In stock · 1 available
PublisherDR.V.R.RASANI
LanguageTelugu
పనికిరాని సగం పాలగింజల్తో ఎండిపోయి, పైకి మాత్రం తాలుగింజలు పచ్చంగా వుంటాయి. చూపులకు బాగానే వుంటాయి. మనమూ అంతేరా. అన్ని సద్దినీళ్ళు, గంజినీళ్ళతో కడుపులు నింపుకొంటూ పైకి మాత్రం బాగానే వున్నిట్టు కనిపించే తాలుగింజలమేరా. ఒకరు డాములు కట్టాలంటే యింకొకరు వద్దంటారు. ఒకరు వద్దంటే యింకొగరు కట్టాలంటారు. వొగేళ కడితే మాకొచ్చేనీళ్ళు తగ్గి పోతాయంటారు. కొందురు మా కొంపాగోడీ మునిగి పోతాయంటారు. నీళ్ళుండేవోళ్ళు వద్దనేదే. నీళ్ళు లేనోళ్ళూ వద్దనేదే. యింకొగపక్క తాగేదానికి కూడా నీళ్ళు దొరక్క అల్లాడి పోతాండారు జనం. వీళ్ళంతా రైతుల ప్రాణాలు నిలబెట్టే నీళ్ళతో జూదమాడతా వుండార్రా జూదం.