JALA SAMPADA by SIDDANI NAGABHUSHANAM Telugu book cover

JALA SAMPADA

by SIDDANI NAGABHUSHANAM

₹200
In stock · 7 available
PublisherSIDDANI NAGABHUSHANAM
LanguageTelugu
జలమే జీవనాధారం జగతికి మూలం జలమే. జీవితానికి మాతృక జలసంపద. అందుకే మానవ జీవితంలో జలం పాత్ర ఎంతో ప్రాధాన్యతను సంతరించుకొంది. మానవ జీవితం చుట్టూరా జలం పెనవేసుకొని ఉంది. సముద్రాలు నుంచి ఆవిరై, మేఘాలుగా రూపాంతరం చెంది, తర్వాత ఘనరూపం దాల్చడంతో వర్షం రూపంలో జలం తిరిగి భూమికి వస్తుంది. ఇదే జలచక్ర పరిభ్రమణ చరిత్ర, పురాతన నాగరికతలు అన్నీ జలం చుట్టూ ఆవిర్భవించి ఎదిగినవే. సింధులోయ, చైనా, ఈజిప్టు నాగరికతలు అన్ని కూడా నదుల వడ్డులలో విలసిల్లినవే. నైలు నాగరికత నైలునది వడ్డున, సింధునదీ వడ్డున సింధునాగరికత, చైనా నాగరికత హ్యుయంగ్ హో నది వడ్డున విలసిల్లినవే. చరిత్రలో జరిగిన కొన్ని యుద్ధాలు కూడా జలం కోసమే. నాగరికత వికాసానికి, విద్వంసానికి కూడా జలయుద్ధాలే ప్రధాన కారణాలు. మహర్షులు జలాన్ని ఆరాధించారు. పురాతన నాగరికతలు అన్నీ కూడా జలం వల్లనే ఫరిఢవిల్లాయి, పతన మయ్యాయి కూడా. వేదాలు, పురాణాలు అన్నీ మన ప్రాచీన పరిజ్ఞానానికి దర్పణాలు. భూ ప్రపంచంలో చరా చర జీవులు అన్నీ పంచ మహాద్భూతాలు వల్ల వర్ధిల్లుతున్నవే. అవే జీవితంలో అంతర్భాగాలని చెబు తున్నాయి. హిందూ వేదాంతంలో జలమే పంచాద్భుతాలలో కీలకమయిందని చెబుతుంది. ఫృద్వీ (భూమి), వాయువు (గాలి), తేజ (అగ్ని), ఆకాశం జలం వల్లనే. జలం పంచాద్భుతాలలో కీలకమయింది. బహుశః జలం ఆధారంగా ఏర్పడినవి. రుగ్వేదం జీవిత ఆరంభం అంతా పంచాద్భుతాలు వల్లనే అని అధర్వణ వేదం. జీవరాసులకు అన్నిటికి మూలం జలం. మానవుడు మరణించిన తరువాత అస్తికలు పంచభూతాలలో విలీనం అవుతాయి. మనిషి జీవనం సాగరంలో పుట్టింది. చాలాకాలం వరకు అక్కడే జీవితాన్ని కొనసాగించింది. లక్షలాది సంవత్సరాలు క్రమాభివృద్ధి చెంది, ఎన్నో రూపాలు ఎత్తింది మానవ జీవితం. రుగ్వేదంలో "సరితం సర్వం ఇదం" అంటే భూమి మీద జీవరాసి పుట్టకముందు భూప్రపంచం అంతా జలమయం. వరుణుడే ఈ జలసంపదకు మూల పురుషుడు. ఆయనే అధిపతి. రుగ్వేదంలో 1028 శ్లోకాలలో, శ్లోకాలు అన్నీ కూడా అగ్ని, జలం, ఆకాశం, భూమి - ప్రకృతి శక్తులకు సంబంధించినవే. వర్షం కురవడానికి, అన్ని ఋతువులు, వాటి ధర్మాన్ని క్రమం తప్పకుండా ఆచరించడానికి పనికి వచ్చే మంత్రాలు ఈ శ్లోకాలు. ప్రకృతి శక్తులను దేవతలుగా భావించడం ద్వారా వాటిని స్తోత్రం చేశాయి. ఇంద్రుడు, యమ, అగ్ని, వాయువు, వరుణుడు. విష్ణువు - సృష్టి సంరక్షుడుగా క్షీరసాగర మధనం.