
JALA VANARULU
₹175
In stock · 1 available
PublisherVIKASA VEDIKA PRACHURANALU
LanguageTelugu
జలవనరులు "మృత్పిందో జలరేఖయా వలయిత స్పర్వావ్యయం సన్వణ సాంశీకృత్య సపర సంయుగ శతై రాజ్ఞాగణైరుృత్యతే" ఈ భూమండలం వట్టి మట్టి ముద్ద. దాని చుట్టూ నీరుంది. ప్రకృతి సమస్త ప్రాణికోటికి ప్రసాదించిన అతి విలువైన సంపదలు. నేల, నీరు, గాలి, అగ్ని, ఆకాశం. అవి నిజంగా పూజనీయాలు, పవిత్రమైనవి. భూమండలం చుట్టూరా ఉన్న నీరెంత? నీటి పరిమాణం 1,460,000 ఘనపు కిలోమీటర్లు. అందులో 97.3 శాతం సముద్రాలు. ఇక మిగిలిన 2.7 శాతం మంచినీరు. ఇది మంచిగడ్డల రూపంలో, నదులలో, భూగర్భంలో, మంచినీటి జలాశయాల్లో కనిపిస్తుంది. సముద్ర జలం, మంచినీరు ఎప్పుడూ నిలకడగా ఉండదు. వాతావరణ పరిస్థితులు బట్టి మంచినీటి, సముద్రపు నీటి నిష్పత్తి మారుతుంది. శీతోష్టస్థితి శీతలంగా ఉంటే మంచుగడ్డలు రూపంలో మారుతుంది. మంచినీరు ఎక్కువ అయితే సముద్రజలం తగ్గిపోతుంది. ఒకవేళ వాతావరణం వేడిగా ఉంటే మంచుగడ్డలు, Glaciers కరిగిపోయి నీరు చేరి తిరిగి సముద్ర మట్టం నెమ్మదిగా పెరుగుతుందని తెలుస్తుంది. అంటే వాతావరణం వేడెక్కుతుందని అర్ధమవుతుంది. ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయం కదా? మంచినీటి పరిమాణం తరిగి పోతే! భూమి ఉపరితలం మొత్తంలో 70.8 శాతం సముద్రాలు. మొత్తంమీద 1445 మిలియన్లు ఘనపు కిలోమీటర్ల నీరు ఉంది. నీరెంత సముద్రంలో ఉన్నా ఏం లాభం. ఉప్పు నీరే కదా? ఎందుకు ఉపయోగం? ఇది ప్రత్యక్షంగా ఉపయోగపడదు. ప్రపంచంలో మనకు లభించే నీరు భూమి మీద, గాలిలో, భూగర్భంలో లభిస్తున్నది. ఈ జలాన్ని మానవులు తెలివిగా ఉపయోగించటానికి వీలుగా మానవుల చుట్టురా ఉంది నీరు. మనిషి నీటి వినియోగంలో జాగ్రత్త పడాలి. విశ్వ వ్యాప్తంగా ఉన్న మంచి నీటి పరిమాణంలో 3240 ఘనపు కిలోమీటర్ల నీరు ఉపయోగించటం జరుగుతుంది. ప్రపంచంలో లభ్యమయ్యే మంచినీటి పరిమాణం 47,000 ఘనపు కిలోమీటర్లు కదా. భారతదేశంలో 1869 కిలోమీటర్లు అంటే ప్రపంచంలో లభించే నీటిలో 4 శాతం లభ్యమవుతుంది.