JALATAARU - NATIKALA SAMPUTI by ANKAM LINGAMURTHY Telugu book cover

JALATAARU - NATIKALA SAMPUTI

by ANKAM LINGAMURTHY

₹80
In stock · 11 available
PublisherANKAM LINGAMURTHY
LanguageTelugu
స్పందన నా కళారంగ ప్రవేశానికి, నన్ను నటుడిగా, దర్శకుడిగా ఈ కళామతల్లికి అందించిన ఆద్యులు, పూజ్యులు, గురువులు శ్రీ అంకం లింగమూర్తిగారేనని చెప్పడంలో సందేహం లేదు. వారు శతాధిక నాటిక రచయిత వారు తన స్వీయరచనలను కళాప్రపంచానికి విస్తృతపరచాలన్న సంకల్పంతో అతడే సైన్యంగా యీ యజ్ఞాన్ని నిర్వహిస్తున్న గురువు గారి నాటికల సంపుటికి నన్ను ముందుమాట వ్రాయమనగానే, నేలవిడిచి సాము చేయడం అనిపించింది అదే చెప్పాను - వ్రాయవోయ్ -ఏంకాదు అన్నారు. గురువుగారు కదా! తప్పలేదు ఈ సంపుటిలో నాటికల ఇతివృత్తాలను విశ్లేషించే ధైర్యం లేదు కానీ వారొక మహారచయితని చెప్పగలను- ఎందుకంటే -వాలాంటి ఔత్సాహిక నటుడు దర్శకులకు ఆయనో మహత్తర ఆయుధం- ఇతివృత్తం మనం చెప్పి వ్రాయమన్నా, వారే ఓ ఇతివృత్తంతో నాటిక రాసుకువచ్చినా, దర్శకులకు వారభిలాషకనుకూలంగా ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా వ్రాయమన్నా, ఓపికతో వ్రాస్తూ వాటికకు పరిపూర్ణత వచ్చేంతవరకు ఎంత మంది సలహాలు చెప్పినా మార్చుతూ ఓ చక్కని నాటికను అందించడంలో వారిని మించిన మరో రచయిత లేరని ఖచ్చితంగా చెప్పగలను. అందుకే మా యిద్దరి నాటక రంగ ప్రయాణం మూడు పదులకు మించి దాటినా మరుగున పడలేదు ఎక్కడో జరిగిన సన్నివేశం చెప్పగానే కొన్ని గంటలలో వాటిక రాసుకొచ్చి "ఇది చూడవోయ్" అనగానే- ఇక కూర్చుని పూర్తి చేసి స్థానిక నాటకరంగ పెద్దలకు చూపించి ప్రదర్శించడం ఆనవాయితే అందుకే స్థానిక, మండల, జిల్లా, రాష్ట్ర అంతర్ రాష్ట్ర పోటీలలో కూడా విజయ దుంధుభిని మ్రోగించాయి వారి రచనలు వారొక "ఇన్స్టాంట్ కాఫీలాంటి వారు" మరుగున పడిపోకుండా వారి చేతివ్రాత వాటికలు, ముద్రితమై కళారంగ బాహుళ్యంలోనికి వస్తే ఔత్సాహిక కళాకారులకు ఎంతో ఊరట -అనడం - అతిశయోక్తి కాదు. ఎనిమిది పదులు నిండినది వారి వయస్సు కానీ వారి రచనలు మాత్రం రెండు ఎనిమిదులు దాటనట్టు, నిత్యనూతనంగా అగుపిస్తాయి "తెలంగాణాకు తలమానికమైన" అరుదైన ఈ రచయితకు ప్రచారాలు లేక, ప్రచారాలు ఇష్టంలేక, జాడా ఫాదర్స్ లేక, అనుకున్నంత గుర్తింపు, ప్రభుత్వం నుండి కాని, ఇతర సంస్థల నుండి కాలేదనడం కన్నా రాలేకపోవడం విచారకం.