JAMES PETRAS VYASA SANKALANAM - 1 by RVR Telugu book cover

JAMES PETRAS VYASA SANKALANAM - 1

by RVR

₹75
In stock · 1 available
PublisherLEFTIST STUDY CIRCLE
LanguageTelugu
ముందు మాట వామపక్ష భావజాలాన్ని అధ్యయనం చేయడం, ప్రచారం చేయడమే లక్ష్యంగా ఏర్పడిన 'లెఫ్టిస్ట్ స్టడీ సర్కిల్' తన లక్ష్యంలో భాగంగా కొన్ని ఇంగ్లీషు వ్యాసాల్ని తెలుగులోకి అనువదించి, ప్రచురించడాన్ని గతం నుండీ చేస్తున్నది. ఇప్పుడు తన నలుబది తొమ్మిదవ ప్రచురణగా జేమ్స్ పెట్రాస్ 1999-2006 మధ్య రాసిన వ్యాసాల్ని కొన్నింటిని ఎంచుకుని (ఇంటర్నెట్ ద్వారా సేకరించి) 'జేమ్స్ పెట్రాస్ వ్యాస సంకలనం-0' అన్న పేర గ్రంథ రూపంలో మీ ముందుంచుతున్నది. ఇలా పెట్రాస్ వ్యాసాల్ని సంకలిత రూపంలో తెలుగు పాఠకుల ముందుంచడాన్ని ఇక ముందు కూడా కొనసాగిస్తామని పాఠకులకు తెలియపరచుకుంటున్నాము. రచయిత జేమ్స్ పెట్రాస్ యూనివర్శిటీ ఆఫ్ బిగ్-హాంప్టన్, న్యూయార్క్ సామాజిక శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్. సమకాలీన మార్క్సిస్టు విశ్లేషకుల్లో అగ్ర గణ్యుడు. ప్రపంచ వ్యాప్త ప్రజా ఉద్యమాల, ప్రత్యేకించి లాటిన్ అమెరికా ప్రజా ఉద్యమాల విశ్లేషకుడిగా, వ్యాఖ్యాతగా సుప్రసిద్ధుడు. కేవలం విశ్లేషకుడు, సైద్ధాంతిక వేత్తగానే కాక సామాజిక ఉద్యమ కార్యకర్తగా బ్రెజిల్లోని వ్యవసాయ కార్మికోద్యమం తోనూ, అర్జెంటీనా నిరుద్యోగ కార్మికోద్యమాలతోనూ, మెక్సికోలోని జపాటిస్టా ఉద్యమంతోనూ, ఇంకా అనేక ఉద్యమాలతోనూ, సంస్థలతోనూ ప్రత్యక్ష సంబంధ ఉన్న వ్యక్తి. హెన్రీ వెల్ట్ మీయర్ తో కలసి ఈ మధ్యే రాసిన 'గ్లోబలైజేషన్ అన్ మాస్క్డ్ -ఇంపీరియలిజం ఇన్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ' అన్న వీరి గ్రంథం చాలా ప్రాముఖ్యం చెందింది. ఇక మన తెలుగు పాఠకులకు సంబంధించి, పెట్రాస్ సుపరిచితుడే. ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలపైనా, సాంస్కృతిక సామ్రాజ్యవాదంపైనా, ఇంకా అనేక ఇతర అంశాలపైనా ఆయన రాసిన వ్యాసాలు కొన్ని తెలుగు దిన, వార, మాసపత్రికల్లో ప్రచురించబడ్డాయి. ప్రత్యేకించి 'ప్రపంచ సామాజిక వేదికలో భాగంగా 'ఆసియా సామాజిక వేదిక మన హైదరాబాద్లో జరిగిన సందర్భంలో జరిగిన చర్చలలో అటు పత్రికలలోనూ, ఇటు వేదికలపైనా పెట్రాస్ పేరు తరచూ ప్రస్తావించబడింది. ఇక ఈ సంకలనంలోని వ్యాసాల్ని గురించి చెప్పాలంటే మొత్తం ఇరవై వ్యాసాలతో ఈ సంకలాన్ని వెలువరిస్తున్నాము. ఈ వ్యాసాలన్నీ వివిధ వైవిధ్య భరితమైన అంశాలపై రాసినవి.