
JANA CHANDRODAYAM - JANAM KOSAM KALAM
₹200
In stock · 45 available
PublisherG.CHANDRAMOHAN GOUD
LanguageTelugu
ఈ గడపవెంటి గంటలు ఆ తలపులై మారాలి... అక్షరాలు కవి చంద్రమోహన్‌గా మొదటి అడుగులు వేశారు. ఇవి. తన మనసులోని భావాలను హృదయాల గడపలను తట్టేలా పదును పెట్టడంలో ఆనందం ఉంది. తన స్పందనలను అక్షరాల రూపంలో మలచడం అతని ఇష్టం. చంద్రమోహన్‌గా పరిచయమైనప్పటి నుంచి నన్ను ఉత్సాహపరుస్తున్నాడు. కవిత్వాన్ని విస్మరించని వ్యక్తి ఇలా పరిణితిగా ఎదగడం సంతోషం. తన కలం ద్వారా సమాజాన్ని జాగృతం చేయాలని చంద్రమోహన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. సమాజంపై దృష్టిపెట్టి పలికే కవితలు, ప్రజలపై ప్రేమను చాటే పాటలు, దళితులపై మమకారం, బడుగు బలహీనుల పట్ల అంకితభావం చంద్రమోహన్‌కు ప్రకృతితో తోడు పుట్టిన గుణాలుగా అనిపిస్తుంది. అభినందనలు అందరూ! — డా. చింతకాని శ్రీనివాస్ తాళం తెరగాలంటే మనం తలుపును ఆత్మీయంగా పలకరించాలి చంద్రమోహన్. సాహిత్య ప్రపంచంలో పాట ప్రత్యక్షమైన వ్యక్తి. ఎన్నో కష్టాలు, నష్టాలను అనుభవించి వాటిని అనుభూతులుగా మలచి తన గేయాల్లో కవితలుగా కూర్చిన రచనలు మనసును కదిలిస్తాయి. పాటల రచయితగా ఎదగాలని కోరుకుంటున్నాను. — సుమాల అశోక్ తేజ చంద్రమోహన్ గారిలో ఎంతో సాహిత్య చైతన్యం కనిపిస్తుంది. అతని ముక్కుసూటి మనస్తత్వం నచ్చుతుంది. తన పాట భావవైభవం ఆదర్శవంతమైనది. ఆత్మవిశ్వాసంతో తన రచనల ద్వారా సమాజాన్ని చైతన్యపరచాలని, సామాజిక చైతన్య గీతాలను రాయాలని, పాటల ద్వారా మంచి సందేశాన్ని అందించాలనే తపన అభినందనీయం. అతని పాటలలో వినిపిస్తున్న పల్లవులు ప్రజలలో చైతన్యాన్ని కలిగించే శక్తిని కలిగివున్నాయని గమనించి నేను సంతోషించాను. పాటల రూపంలో అతడు ఆలోచనలను గుండెల్లో ప్రతిధ్వనింపజేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. — వాడే వెంకటేశ్వర్లు పెదింటి చంద్రమోహన్, పాటల సాహిత్యాన్ని విశదీకరించిన ఉత్తర తెలంగాణ చంద్రమోహన్ గారే. పాటల ప్రక్రియలో, సాహిత్య సిద్ధాంతాల పరిశీలనలో, పరిశోధనలోనూ, ప్రాయోగికంగానూ... ప్రజాస్వామ్యంతో... సమాజంతో... ఉద్యమాలతో మమేకమై తన కలం పదును జవదాటిన గొప్ప కవి. చంద్రమోహన్ ప్రజల గుండెల్లో గీతలుగా పలికే పదాల కవి. చంద్రమోహన్ పుస్తకం వెలువడిన సందర్భంగా ఈయన తన కలం నుండి వెలువడబోయే 100 పాటలతో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అభినందనలు.