JANA JEEVANAM DARI PODUGUNA by ALLAM RAJAIAH Telugu book cover

JANA JEEVANAM DARI PODUGUNA

by ALLAM RAJAIAH

₹390
In stock · 11 available
PublisherMALUPU BOOKS
LanguageTelugu
ISBN9789385076558
కాల సందర్భాలు సమాజ చలనాల్ని, సాహిత్య ప్రస్థానాల్ని మలుపు తిప్పేంత శక్తివంతమైనవి. విప్లవోద్యమం సాహిత్యగతిని నిర్దేశిస్తే తెలంగాణ సందర్భం పరిశోధనాగతిని మార్చివేసింది. విస్మృతి పొందిన మహానీయులెందరినో తిరిగి చర్చకు పెట్టి పునరంచనా వేసి చరిత్రలో కొత్తగా స్థిరపరుస్తున్నది. తెలుగు సాహిత్యంలో దిగంబరకవిగా, విప్లవ రచయితగా, పాటల ప్రదర్శకునిగా చెరగని ముద్ర వేసిన చెరబండరాజు వచన సాహిత్యం మీద వంగాల సంపత్రెడ్డి పరిశోధన కొత్త వెలుగులు ప్రసరించింది. తెలంగాణ పల్లెలు, వ్యవసాయ జీవితం, భూ సంబంధాలు, పోరాటాలు, మానవ సంబంధాలు, వైవిధ్యాలు, వైరుధ్యాలు, గ్రామీణత ఆధునికత ఘర్షించుకునే సన్నివేశాలు లోతుగా, బలంగా, నిశితంగా సంపత్ చర్చించాడు. మధ్యతరగతి నుంచి, పేదరిక పరాధీనత నుంచి, విద్యావ్యవస్థల నుంచి విప్లవ చైతన్యం విస్తరించిన కాలం, క్రమపరిణామం, వ్యవస్థల రాజకీయార్థిక నేపథ్యం, రచయిత దృక్పథం సవివరంగా విశ్లేషించిన వర్ణచిత్రమీ పరిశోధన, చెరబండరాజు నవలల్లో పాటను సంధానించగా ఆయా నవలల రచనాకాలంలో 'చెర'చింతన, సృజించిన కవితల్ని అన్వయించి విశ్లేషించటం సంపత్ పరిశోధనలోని ప్రత్యేకత. జీవితం నుంచి నేర్చుకొని జీవితాన్ని ఉన్నతంగా మలుచుకొని ఉత్తమ మానవ సమాజ నిర్మాణం కోసం 'చెర' అందిపుచ్చుకున్న విప్లవ సాహిత్య నిర్మాణ వ్యూహానికి నిజమైన పరిశోధన ఇది. కాత్యాయని మార్గదర్శనం కలిసి వచ్చిన సమయం. చెరబండరాజు సాహిత్య తాత్విక విశ్లేషణకు ఇది సమగ్ర దర్పణం.