JANAMADHYAMALU SAMAJIKA BHADHYATA by DR.G.GOPAL REDDY AND T.HARIHARA SARMA Telugu book cover

JANAMADHYAMALU SAMAJIKA BHADHYATA

by DR.G.GOPAL REDDY AND T.HARIHARA SARMA

₹75
In stock · 3 available
PublisherDR.G.GOPAL REDDY AND T.HARIHARA SARMA
LanguageTelugu
సమాజం-సమాచారం తనకంటే సమాచారం ప్రాతిపదికగానే ఆధునిక సమాజాలు రూపుదిద్దు కుంటున్నాయి. అనునిత్యం దినపత్రికలు, రేడియో, టీవీలు, సినిమాలు ప్రజలపై ఎంతో ప్రభావాన్ని చూపుతున్నాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి విశ్రమించేవరకూ ప్రజల ఆలోచనా సరళులను తీర్చిదిద్దుతున్నాయి. జనమాధ్యమాల నిర్వహణకు భారీ పెట్టుబడుల అవసరం ఏర్పడ అంతో ఈ రంగంలోకి బడా పారిశ్రామిక వేత్తలు ప్రవేశించారు. అత్యంత శక్తిమంతమైన జనమాధ్యమాలను తమ వ్యాపార ప్రయోజనాపేక్షతో వీరు దీక్షిస్తున్నారు. వ్యాపార ప్రయోజనాల ముందు సమాజ విశాల హితం ఒక్కోసారి ఉపేక్షకు కూడా గురవుతోంది. మారుతున్న జగతిలో జనమాధ్యమాలు నిర్వర్తించవలసిన సామాజిక జాధ్యతపై దృష్టి సారించటానికి రచన జర్నలిజం కళాశాల 2001 అక్టో ఐర్ 6, 7 తేదీల్లో రెండు రోజుల సదస్సు నిర్వహించింది. జర్నలిజం రంగంతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్న ప్రముఖులు ఈ సదస్సుకు హజరై తమ అభిప్రాయాలను పాలుపంచుకున్నారు. ఆ అభిప్రాయాల సమాహారమే ఈ పుస్తకం. వ్యాసాలను కొందరు సకాలంలో అందివ్వక పోవడంతో పుస్తక ప్రచురణలో జాప్యం జరిగింది. అయినా ఇప్పటికైనా వస్తకాన్ని మీకు అందివ్వగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ పుస్తకంలోని వ్యాసరచయితల అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి. ఆ అభిప్రాయాలతో 'రచన' ఏకీభవిస్తున్నదని భావించనక్కరలేదు. జనమాధ్యమాలను అవగతం చేసుకోవటానికి, సామాజిక బాధ్యతా వరంగా అవి నిర్వర్తిస్తున్న పాత్రను అర్థం చేసుకోవటానికి ఈ పుస్తకం ఉపకరిస్తుంది.