JANANA BHIBATYAM MARANA SOUNDARYAM by PROF.RAMA CHNADRAMOULI Telugu book cover

JANANA BHIBATYAM MARANA SOUNDARYAM

by PROF.RAMA CHNADRAMOULI

₹100
In stock · 1 available
PublisherPROF.RAMA CHNADRAMOULI
LanguageTelugu
నిరంతరమూ... అనంతమూ., ఆ పాత కోటగోడల శిథిలాలనుండి నడుస్తున్నపుడు..., ఏదో ఉద్విగ్నత... ఏదో వ్యాకులత... ఏదో అవ్యక్తావేశం... ఎందుకో పొంగి పొంగి పొర్లే దుఃఖం. అడుగుల కింది మట్టిలో... ఏదో ఒక అశరీరజీవి కదుల్తున్నట్టు... మట్టిపొరల లోలోతుల్లో సమాధియైపోయిన మానవ చరిత్ర మళ్ళీ చేతులు చాచి బాహువుల్లోకి పిలుస్తున్నట్టు.., ఎవరో... తనకు తెలిసినవారే... ఎవరో తనకు చెందినవాళ్ళే.. తనదే ఐన సంతతి నుండి ఏదో వినబడని పిలుపు... రాళ్ళు... అవశేషాలు... శిల్పాలు... విరిగిపోయిన విగ్రహాలు... పొందికగా కూర్చి కట్టిన పెద్దపెద్ద రాతి కట్టడాలు.. వందల సంవత్సరాల తర్వాతకూడా నిన్ననే ఎవరో పాలిష్ చేసినట్టు ధగధగా మెరుస్తున్న గ్రానైట్ శిల్పాకృతులు... ఆ రాతి నగలు, నగిషీలు, శరీర భంగిమ.. అసలా ఎత్తుపల్లాలను, వక్రరేఖా తలాలను అంత నున్నగా ఏకరీతిగా మెరుపు పెట్టగల సాంకేతిక పరిజ్ఞానం అప్పటి ఆ తరానికెక్కడిది... వాళ్ళు ఏ పనిముట్లను వాడారు, ఏ సిద్ధాంతాలను పాటించారు...ఏ నియమాలను అవలంభించి యింత పెద్ద పెద్ద శిలలను యింత ఖచ్చితంగా కూర్చి యింత భారీ నిర్మాణాలను.. ఆలయాలను, కోటగోడలను, మంటపాలను నిర్మించారు.. మనకంటే ఎంతో విజ్ఞానవంతులైన తరాలు కాలగతిలో నశించిపోయాయా, నైపుణ్యతా, పనితనమూ, మేధాపటిమ ఎంతో ఉన్నతంగా గల ఒక జాతి కాలగర్భంలో కలిసిపోయి ఆనవాళ్ళుగా ఈ శిథిలాలై మిగిలాయా.: సైంటిస్ట్ రాయలు చటుక్కున ఆగిపోయి కిందికి చూశాడు.