JANANETHA by DR.L.VIJAYA KRISHNA REDDY Telugu book cover

JANANETHA

by DR.L.VIJAYA KRISHNA REDDY

₹200
In stock · 1 available
PublisherDR.L.VIJAYA KRISHNA REDDY
LanguageTelugu
ఈ ప్రయత్నం ఎందుకంటే... రాజశేఖర రెడ్డి మరణించారని తెలిశాక ఆ వాస్తవాన్ని జీర్ణించుకోవడానికి నాకు కొద్ది సమయం పట్టింది. ఆ బాధలోంచి తేరుకోవడానికి కొన్ని రోజులు పట్టాయి. వృత్తిరీత్యా నాకు చాలామంది రాజకీయ నాయకులతో పరిచయం ఉండేది. వాళ్లెవ్వరిలో చూడని విశిష్ట గుణాల్ని వైఎస్లో చూశాను. సామాన్య కూలీ నుంచి పెద్ద కార్పొరేట్ కంపెనీ ఎండీ వరకు ఎవరు తనను కలవడానికి వచ్చినా ఆయన సమానమైన దృష్టితో వారికి విలువ ఇచ్చి మాట్లాడుతారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అకాలమరణం పాలైన తర్వాత జనకోటి హృదయ విలాపాన్ని ప్రతిబింబిస్తూ మీడియా యావత్తూ నివాళి అర్పించింది. ఆయన వ్యక్తిత్వ బెద్ధత్యాన్ని జనవాళికి మరోమారు గుర్తుచేస్తూ పత్రికల్లో సంపాదకీయాలు, సీనియర్ జర్నలిస్టులు, తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి వంటి రాజకీయ నాయకుల అనుభవాలు, ఇంకా భిన్న వర్గాల మేధావులు రాసిన కథనాలు, వ్యాసాలు, విశ్లేషణలు వచ్చాయి. అవేవీ కాలగతిలో కలసిపోదగినవి కాదు. ఆ ఆలోచనే ఈ సంకలనానికి అంకురార్పణ. వైఎస్సార్ వ్యక్తిత్వాన్ని చిత్రికపట్టిన విశ్లేషణలకు ఒక శాశ్వతత్వం అపాదించడమే ఈ ప్రయత్నం. ఎంపిక చేసి కొన్ని ప్రచురిత కథనాలతో పాటు, కొన్నింటిని ప్రత్యేకంగా రాయించాం. ప్రచురించిన పత్రికల వారికి, రచయితలకు శతథా కృతజ్ఞతలు. వివిధ పత్రికల వ్యాసాలు సంకలించడంలో పునరుక్తులను పరిహరించడానికి కొంత ఎడిటింగ్ అనివార్యమైంది. అన్యధా భావించవద్దని వేడుకోలు. జననేత వైఎస్సార్ జనం చెంతకు వెళుతూ కన్నుమూశారు. ఆ మహానాయకుడికి, ఆయన వెన్నంటి తోడుగా అమరలోకాలకు తరలివెళ్ళిన ముఖ్య కార్యదర్శి డాక్టర్. పి. సుబ్రమణ్యం, భద్రతాధికారి వెస్లీ, పైలట్ భాటియా, కోపైలట్ ఎం.ఎస్.రెడ్డి లకు నివాళులు. వైఎస్ హఠాన్మరణాన్ని విని తట్టుకోలేక ఆగిన గుండెలెన్నో... తమ అభిమాన నేత ఇక లేరనే వాస్తవాన్ని తట్టుకోలేక బలవన్మరణం పొందినవారు మరెందరో... వారందరికీ పేరు పేరునా నివాళి. రెండు చేతులు కలవందే ఏ పనీ జరగదు. ఓ మహాక్రతువు జరగాలంటే వేయి చేతులు కలవాల్సిందే. అలాంటిది ఈ సంకలనం అనే బృహత్ ప్రయత్నానికి బహుధా సహకరించిన, ప్రోత్సహించిన సహృదయులు అగణ్యం. తొలుత స్పియరాన్ కమ్యూనికేషన్స్ వారు ఈ సంకలనాన్ని పాఠకుల ముందుకు తెచ్చారు. పాఠకులు చూపిన అభిమానం అపారం, వైఎస్సార్ అభిమానులు మరింత మందికి ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తేవడానికి తాజాగా దివ్యతేజ పబ్లికేషన్స్వారు ముందుకొచ్చి ప్రచురణకు శ్రీకారం చుట్టారు. అందుకు సమ్మతించిన స్పియర్ హెడ్ కమ్యూనికేషన్స్ వారికి ప్రత్యేకంగా అభివందనాలు.