JANAPADA NATAKALU by PROF.BALA ARUNAKUMARI Telugu book cover

JANAPADA NATAKALU

by PROF.BALA ARUNAKUMARI

₹125
In stock · 3 available
PublisherPROF.BALA ARUNAKUMARI
LanguageTelugu
ఉత్కళదేశంలో పుట్టి, ఉత్కళ విశ్వవిద్యాలయ పట్టభద్రురాలై ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎం.ఎ., పట్టా పొందారు. ఆంధ్ర వాఙ్మయంలో చారిత్రక కావ్యములు 17వ శతాబ్ధం వరకు అనే అంశంపై పరిశోధన చేసి, పి.హెచ్.డి. పట్టా పొందారు. ఆ సిద్ధాంత వ్యాసం యు.జి.సి. వారిచే ప్రచురింపబడింది. సంగీతం, సాహిత్యం చిత్రలేఖనాలలో మిక్కిలి అభినవేశం ఉన్న ఆచార్య బాలఅరుణకుమారి, తెలుగుతో పాటు, ఆంగ్లం, ఒరియా, హిందీ భాషల్లో ప్రవేశం ఉంది. ఆమె ఒరియా కథామాల అనే పుస్తకాన్ని జాతీయ పుస్తక సంస్థ కోసం తెలుగులోకి అనువదించారు. ఆంధ్రప్రదేశ్ పాచ్యలిఖిత పుస్తక భాండాగారం, హైదరాబాదు వారు వీరి సంపాదకత్వాన, ఉదయనోదయము అనే కావ్యాన్ని వెలువరించారు. ఇంచుమించు 8 పుస్తకాలు ప్రచురింపబడ్డాయి. అరుణబాల అనే కలం పేరుతో ఆంధ్రప్రభ, తెలుగు విద్యార్ధి, విశాలాంధ్ర, ఈనాడు, మొదలైన పత్రికల్లో ఇంచుమించు 70 వరకూ వ్యాసాలు, అనువాదాలు, గేయాలు, స్కెచ్లు ప్రచురింపబడ్డాయి. ఎన్నో రేడియో ప్రసంగాలున్నాయి. తెలుగు శాఖలో శాఖాధ్యక్షురాలిగా పనిచేసిన ఆచార్య అరుణకుమారి కవిత్రయ, తెలుగు వెలుగు లాంటి అవార్డులు వచ్చిన విదుషి.