JANAPADA SAHITYAM THOTI KORRAJULA SAMSKRUTHI by DR.SRIMANTULA DAMODAR Telugu book cover

JANAPADA SAHITYAM THOTI KORRAJULA SAMSKRUTHI

by DR.SRIMANTULA DAMODAR

₹100
In stock · 4 available
PublisherDR.SRIMANTULA DAMODAR
LanguageTelugu
డా॥ శ్రీమంతుల దామోదర్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట సమీపాన ఉన్న కనగర్తి గ్రామంలో ఫిబ్రవరి 9, 1976 న సరోజన, బ్రహ్మనందం పుణ్య దంపతులకు జన్మించారు. కాకతీయ విశ్వ విద్యాలయంలో ఎం.ఏ తెలుగులో డిగ్రీ పొందారు. కాకతీయ విశ్వ విద్యాలయం తెలుగు విభాగం నుండి “జానపద సాహిత్యం- తోటి (కొర్రాజుల) సంస్కృతి" అంశంపై పి.హెచ్.డి పట్టాను పొందారు. డా॥ శ్రీమంతుల దామోదర్ కాకతీయ విశ్వ విద్యాలయం ద్వారా ఎం.ఎ లో 4వ ర్యాంకు సాధించారు. గత పదకొండు సంవత్సరాలుగా ఈయన జానపద, గిరిజన విజ్ఞాన సేకరణ అధ్యయన రంగాల్లో విశేష కృషి చేస్తున్నారు. వివిధ దిన, వార మాస పత్రికల్లో వీరి వ్యాసాలు ప్రచురితమైనాయి. జాతీయస్థాయి సదస్సులు, శిక్షణా శిబిరాల్లో పాల్గొని జానపద గిరిజన విజ్ఞాన బహు ముఖాంశాలపై, తెలుగు సాహిత్యంపై పత్ర సమర్పణలు చేశారు. రచనా వ్యాసంగంలోను, సేకరణ పరిశోధన రంగాల్లో, సాహిత్యంలో తనకు గల మక్కువకు మరింత పదును పెడుతూ జానపద గిరిజన విజ్ఞాన పీఠం, వరంగల్లులో ప్రాజెక్ట్ అసిస్టెంట్గా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. జానపద సాహిత్యంపై మక్కువతో గిరిజన కళారూపమైన "జానపద సాహిత్యం - తోటి (కొర్రాజుల) సంస్కృతి” గురించి పలు కోణాలలో చేసిన పరిశోధనా అంశాలన్నీ ఈ గ్రంథానికి వెలలేని మకుటాలు.