JANAPADALU GNANAPATHALU by YALLAPRAGADA PRABHAKARA RAO Telugu book cover

JANAPADALU GNANAPATHALU

by YALLAPRAGADA PRABHAKARA RAO

₹100
In stock · 16 available
PublisherKOUNDINYA PUBLISHERS
LanguageTelugu
మా మాట మాకు ప్రచురణ రంగము, ఆమాట కొస్తే అసలు సాహిత్య రంగమే క్రొత్త. మా వృత్తులు, వ్యాపకాలు వేరు. మానాన్నగారు శ్రీ పంగులూరి హనుమంత రావు గారు తమ విశ్రాంత జీవితంలో సద్గ్రంథ పఠనం చేస్తూ ఆథ్యాత్మిక చింతనలో పడినారు. ఈ నేపథ్యంలో 14-4-2009న మా మాతృమూర్తి శ్రీమతి పంగులూరి సీతాదేవి గారు స్వర్గతులైనారు. మా నాన్నగారికి అశనిపాతమే అయింది. ఆమె జ్ఞాపకాలను మరిచి పోవటానికి గ్రంథపఠనం మరింత అధికం చేశారు. ఆ సందర్భంలోనే “తిరువళ్లువర్” దివ్యకృతి "తిరుక్కురళ్" ఆంగ్ల అనువాదం చదవటం ఆకర్షితులవటం జరిగింది. అది కీ.శే. వి.వి.ఎస్. అయ్యర్ గారి అనువాదం. దాని ఫలితంగా విచారించగా కీ.శే. చక్రవర్తుల రాజగోపాలచారి (రాజాజీ), శ్రీ జె. నారాయణసామిగార్ల అనువాదాల విషయం తెలిసింది. వాటిని తెప్పించుకున్నారు. అన్నీ పరిశీలించిన మీదట “తిరుక్కురళ్"ను తెలుగు వారికి అందిస్తే అన్న ఆలోచన కలిగింది. వెంటనే వారి చిరకాల మిత్రులు, మా గురువుగారు శ్రీ యల్లాప్రగడ ప్రభాకర రావు గారిని సంప్రదించారు. అనిష్టంగానే అయినా స్నేహధర్మంగా అంగీకరించారు. వారిద్దరి అనుబంధం అలాంటిది. అనువాదం పూర్తి అయిన తరువాత వ్రాతప్రతిని మా నాన్నగారి చేతుల్లో పెట్టారు. అది 2009 సంవత్సరం చివరినెల చివరి వారం. సరిగ్గా రెండు మూడు నెలల తరువాత మా తల్లిగారి ప్రథమవర్థంతి రానున్న సందర్భం కావటం యాదృచ్ఛికం. 'మనమే ఆమె స్మృత్యర్థం ఎందుకు ప్రచురించకూడదు' అన్న ఆలోచన మానాన్నగారికి, మాకు కలిగింది. ఆ విధంగా 'శ్రీ కౌండిన్య పబ్లికేషన్స్' ఆవిర్భవించింది. ప్రథమ ప్రచురణగా “తిరుక్కురళ్” అనువాదం జానపదాలు : జ్ఞానపథాలు స్వీకరించాం. ఇది మా తొలిప్రయత్నం. కాని కొన్ని అనివార్యమైన పరిస్థితుల కారణంగా రెండవ ప్రచురణకు స్వీకరించిన డా॥ రాధశ్రీగారి రచన “భగవాన్ శ్రీ సత్యసాయి శతవసంతం” ముందుగా వెలువడింది. ఈ ప్రశస్తమైన కృతియొక్క అనుసృజన వెలుగు చూడటానికి ఎందరి సహకారమో అవసరమైంది. వారందరూ మాపైగల ప్రేమానురాగాల వల్ల కానివ్వండి, స్నేహ భావం వెండిన సహృదయం వల్ల కానివ్వండి అడుగడుగునా ప్రోత్సహిస్తూ తమ సహకారాన్ని అందించారు.