JANTALU - 1 by DR.KONDALARAO VELCHALA Telugu book cover

JANTALU - 1

by DR.KONDALARAO VELCHALA

₹150
In stock · 4 available
PublisherDR.KONDALARAO VELCHALA
LanguageTelugu
నా మాట! మిర్జా గాలిబ్ ఉర్దూ భాషలో అత్యుత్తమ శ్రేణి కవిగా సుప్రసిద్ధుడు. అతని భాషా భావాలు చాలా సున్నితమైనవి, సుకుమారమైనవి, సుతారమైనవి. అతని భాష తాత్త్విక భాష అతని భావం దార్శనిక భావం. అతడే అంటాడు "నేను బయటికి నాస్తికున్ని, జోపల ఆస్తికున్ని", "నా భావాలా? అవి కల్పవృక్షాలు, నా అక్షరాలా? అవి కామధేనువులు, అంతు చేతనలు", "నా కవితల్లోని ఒక్కొక్క పంక్తిని తీసుకోండి మీరు, అక్షరాలకు బదులు సనవాలు లభిస్తాయి మీకు, అర్థాలకు బదులు అంతరార్థాల ఖజానాలు" యని. అతని తలు అప్పటికీ ఇప్పటికీ అనేకానేక సందర్భాలలో ఉటంకించబడతాయి. ఎందుకంటే, అవి వాటికి అవే సాటి. అతనికిలాగే అతని కవితలకు కూడా లేవేవి పోటీ. అతడే "నాకన్నా ఉద్దండులైన కవులు ఎందరో వున్నారు, అయినా అదేమిటో కాని వారంటారు దాలిలక్కు గాలిబే సాటి, లేరెవరు అతనిపాటియని" అంటాడు. వాలిబ్ కవితలు అనువదించడం అతికష్టమైన పని. దానికి ఏ అనుమానమూ అతని కవితలు అనేకానేకులు అనేకానేక భాషల్లో ఇంతవరకే అనువదించారు. తెలుగులోకి కూడా అనువదించారు చాలామంది. కొందరు పద్యాలలోకి మార్చారు. కొందరు వచన కవితలలోకి. కొందరు వారి అనువాదాలను 'గజళ్లు' అన్నారు. అందరూ ఉత్తమ కవులే, అందరివీ ఉత్తమ అనువాదాలే. మరి నేనెందుకు మరొకటి చేబడుతున్నట్లు? విశ్వనాథవారన్నట్లు ఎవరి పంథా వారిది, ఎవరి ప్రయత్నం వారిది. ఎవరి లక్ష్యం వారిది. నా లక్ష్యం గాలిబ్ కవితల్లోని కొన్ని పంక్తుల సారాన్ని తెలుగువారికి సరళంగా, సులభంగా తెలుగులా అనిపించేట్లు, వినిపించేట్లు అందించడం. అవి మక్కికి మక్కి వాలిబ్ కవితలకు అనువాదాలా అంటే, కావనే చెప్పాలి.