
JARUDU BANDALU
₹100
In stock · 1 available
PublisherKETURI RAMREDDY
LanguageTelugu
'కొత్తచివుళ్లు' కథాసంపుటి ద్వారా పాఠకులకు ఇదివరకే పరిచయమైన కూతురు రాంరెడ్డి 'జారుడు బండలు' అనే తన రెండవ పుస్తకంద్వారా మరోసారి సహృదయ పాఠకుల ముందుకు వస్తున్నాడు. ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా విధి నిర్వహణలో ఉన్నప్పుడు అప్పుడప్పుడూ రాసినా ఉద్యోగ విరమణ తరువాత తన కలాన్ని పదునుచేసి కథారచనకు పూనుకోవడం అభినందించదగ్గ విషయం. సమకాలిక సమాజంలోని దైనందిన జీవితాన్ని కళ్లకుకట్టినట్లు చిత్రించడం ఒక గొప్ప కళ. రచయిత శైలిలో చెప్పుకోదగ్గ అంశం. ఈ విషయంలో రాంరెడ్డి కృతకృత్యుడైనాడనే చెప్పాలి. వ్యవస్థలోని లొసుగుల పట్ల చురకలు వేస్తూనే నవ్వుపుట్టించడం మరో గొప్ప లక్షణం. ఆరు దశాబ్దాల క్రితం కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ గ్రామంలో కళ్ళు తెరిచిన కూతురు రాంరెడ్డి, తాను పుట్టి పెరిగిన తెలంగాణ గడ్డలోని వెనుక బాటుతనాన్ని, పేదరికాన్ని, సాంఘిక అసమానతలను-తన కథల్లో ప్రతిబింబింపచేయడంలో కూతురు రాంరెడ్డి విజయం సాధించాడనే చెప్పాలి. - తాళ్లపల్లి మురళీధర గౌడు పుస్తక రూప శిల్పి