JASHUVA AANIMUTHYALU by THALLURI LABAN BABU Telugu book cover

JASHUVA AANIMUTHYALU

by THALLURI LABAN BABU

₹90
In stock · 462 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
1. జాషువా కవితా వైభవం జలకంబులాడించు చెలికత్తె గద నీకు గనకాంబు జాధ్య గంగా భవాని తలమీది గందుమల్లెల దండగద నీకు సత్యున్నతోరు హిమాలయంబు పూత బంగారు సొమ్ముల పెట్టె గద నీకు సిరివెలంది చరించు సింహళంబు ముద్దుగారెడు నిగ్గుటద్దంబు గదనీకు నిండారు హిందూ మహాంబురాశి ఇట్టి నిన్ను జూచి బిచ్చంబు బెట్టుమనుచు నన్ని దిక్కులనిన్ను యాచించు చున్నవమ్మ యైక మత్యంబు గల్గి నిన్ననుభవించు కొరత పూరింపవే మాకు భరతమాత! (1. ఖండ-2, భరతమాత) కన్నతల్లి రుణం తీర్చలేనిది. దేశమాత రుణం ఎన్నటికి తీర్చలేనిది. ఎందరో కవులు దేశమాతను కీర్తిస్తూ గొప్ప కవిత్వాలు చెప్పారు. 'వందేమాతరం' అని బంకించంద్రుడు, 'నమోహిందుమాత' అని తెలుగు కవి, 'సగర మాంధాతాది' అని జాషువా భరతమాతను కొనియాడారు. తల్లి భారతిని మంచి గేస్తురాలుగా అభివర్ణించిన జాషువా ఈ దేశ నైసర్గిక స్వరూపాన్ని మరింత గొప్పగా ఈ పద్యంలో వర్ణించాడు. భరతమాతను జలకాలాడించే చెలికత్తెగా గంగమ్మ తల్లిని పోల్చాడు. గంగానది స్వర్ణకమలాలతో నిండి ఉంటుంది. హిమాలయాలను భరతమాత జడలో ముడుచుకొనే మల్లెలదండగా పోల్చాడు. సింహళ భూఖండాన్ని భరతమాత తన భూషణాలను భద్రపరచే ఖజానా పేటికతో పోల్చాడు. ఈ అభివ్యక్తి జాషువా కవితా వైభవానికి నిదర్శనం. 'నమో హిందుమాత!' సుజాత నమో జగన్మాతా! ప్రార్ధనా గీతంలో కవి 'సెంహళమే నీ పాదపీఠమట!' అంటాడు. పొరుగుదేశాన్ని మన దేశానికి పాదపీఠంగా