
JASHUVA ANARGHA RATNALU - 90.00
₹90
In stock · 678 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
జాషువా కవిత్వం - వ్యక్తిత్వం - తత్త్వం జాషువా జన్మించిన ఆనాటి పరిస్థితులను గమనించినట్లయితే ఆయన కూటికీ కులానికీ పేదవాడు, వర్ణ వివక్ష ఆర్థిక వివక్షలు బాల్యంలో ఆయనపై విపరీతమైన ప్రభావాన్ని చూపెట్టాయి. ఆ క్రమంలోనే ఈ వివక్షలు ఆయన వ్యక్తిత్వంపైన, ఆపైన ఆయన కవిత్వంపైన, "కవిత్వం ద్వారా సాంఘిక విప్లవం" వైపు ఆలోచించడానికి దోహదపడ్డాయి. అందుకే శ్రీ దీవి కుమార్ అంటాడు. సామాజిక ఆవేదననీ, ఆర్తినీ పద్య కావ్యాలలో పలికించిన మొదటి కవి బహుశ చివరి కవి కూడా జాషువానే కావచ్చు. కవిత్వం అగ్రకులాల గుత్త సాత్తుగా చెలామణి అవుతున్న కాలంలో పట్టుదలగా సాధన చేసి వారిలో చాలామంది కంటే మెరుగ్గా కవిత్వం రాయగలను అని రుజువు చేయడం ఆయన పరమాశయమయింది - అంటాడు. జాషువా కవిత్వంపైన వ్యక్తిత్వంపైన తండ్రి వీరయ్య, తల్లి లింగమాంబల ప్రభావంతో పాటు, ఆనాడు సాగిన జాతీయోద్యమం, స్వాతంత్య్ర పోరాటం, అస్పృశ్యతా నివారణ వీటికి నాయకత్వం వహించిన గాంధీజీ నేతాజీ ల ప్రభావం ఎంతో ఉన్నదని ఆచార్య వి. రామకృష్ణ అంటాడు. హైందవ నాగరికతను, దేవుళ్ల పేరుతో జరుగుతున్న దురన్యాయాలను ఖండిస్తూ సామాజిక మార్పు కోసం మనిషి మారాలి గాని ఈ ముక్కోటి దేవుళ్ళు మార్పు తేలేరు అంటాడు జాషువా కవీంద్రుడు. ధర్మ సంస్థాపనార్థంబు ధరణి మీద నవతరించెనని నజ్జభవుని తండ్రి మునుపు జన్మించి నెత్తి కెత్తి నది లేదు నేడు జన్మింప కున్న మున్గినది లేదు అని 'నారాయణుడు" గూర్చి పద్య నాటకం 'రుక్మిణి పరిణయం' తో మొదలు పెట్టిన కవితా ఝరిని 'గబ్బిలం' కావ్యంతో “దరిథ్ర నారయణుడి” వైపు మరల్చాడు. ఆ విధంగా గబ్బిలంలో వ్యక్తిగా సమాజంపై తిరుగుబాటు, కవిగా కవిత్వంలో తిరుగుబాటు, దళితుడుగా ఆత్మ గౌరవానికై తిరుగుబాటు చేసినట్లు ప్రస్ఫుటంగా కన్పిస్తుంది. గబ్బిలం కేవలం దళితుల ఆత్మగౌరవ పోరాటంగానే గాక కావ్య ప్రక్రియలోను