JASHUVA SAHITHI PRASTHANAM by DR.S.V.SATYANARAYANA Telugu book cover

JASHUVA SAHITHI PRASTHANAM

by DR.S.V.SATYANARAYANA

₹100
In stock · 184 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
జాషువా జీవితం - వ్యక్తిత్వం - శ్రీమతి హేమలతాలవణం స్వపరిపాలనమన్న శబ్దంబు దేశంబు వీనుల విందుగా వినక ముందు సత్యాగ్రహోద్యమ జ్వాల పశ్చిమ దిశా కుటిల శక్తుల కంటుకొనకముందు ప్రతివాని స్వస్వరూప జ్ఞాన సంపత్తి కునుకు నిద్దుర మేలుకొనక ముందు ఘనదురాచార సాగర మగ్నమై ప్రజా బాహుళ్య మొడ్డున బడకముందు కిలత గింజల శాసనంబులకు వెఱచి కొట్లలో పంట తలదాచుకొనక ముందు వడిదుడుకు లేని మన్మధాబ్దంబు నందు ప్రభవమందితి నమ్మినీ పట్టణమున. అది 1895 సెప్టెంబరు 28. తూర్పు దిగ్భాగం రాగ రంజితమవుతూ ఉండగా లింగమాంబ మగబిడ్డను ప్రసవించింది. పురిటిలోనే బిడ్డలు పోయి పోయి, హృదయం చిమ్మ చీకటైపోగా, యీ బిడ్డ 'కేర్' మన్న మధుర స్వరం వీరయ్య హృదయ సీమన సూర్యోదయమైంది. ఆ బిడ్డ జాషువ. కళ్ళు తెరచి ప్రపంచాన్ని పరికింపసాగి, అడుగులు వేసి, నడక సాగించగానే బాలుడైన జాషువాకు అర్థమైంది తాను మనిషిగా ఎదగడానికి అనుకూలమైన సాంఘిక సాహితీ ప్రస్థానం