
JASHUVA SAHITYAM DRUKPADAM PARNAMAM
₹60
In stock · 1 available
PublisherMANASA MANOGNA PRACHURANALU
LanguageTelugu
ధన్యవాదాలు - నేపథ్యాలు నా పిహెచ్.డి; ఓ పెద్దకథ. అది సాధించడం నా జీవితాశయం కూడా. అలాగే తెలుగు పంతులు కావాలనుకోవడం మరో కోరిక. నా భార్య హేమలత రచనా సహకారంతో పెళ్ళి అయ్యాకే యం.ఎ., యం.ఫిల్ పూర్తి చేశాను. అయితే 'యం. ఫిల్ ఎంగేజ్ మెంట్ లాంటిది. పిహెచ్.డి., పెళ్లి లాంటిది' అని ఛలోక్తులు విసిరేవాణ్ణి. పిహెచ్.డి. 'వైవా' హిత కార్యక్రమం పూర్తయితేగాని కథ సుఖాంతం కాదు. తెలుగు విశ్వవిద్యాలయంలో ఉద్యోగం రావడం నా జీవితంలో గొప్ప అవకాశం. సాహిత్యపీఠం- నన్నయ ప్రాంగణంలోకి యం.ఎ., యం.ఫిల్తో అడుగుపెట్టాను. పిహెచ్.డి; పట్టా లేకపోతే ఒక పట్టాన మనల్ని పట్టించుకోరు. కొన్ని విద్యాత్మక అవకాశాలుండవు. అదనపు యింక్రిమెంట్లు లభించవు. కొన్ని కమిటీల్లోకి రానివ్వరు. పర్యవేక్షణా బాధ్యతలు చేతికివ్వరు. డాక్టరేటు డ్రైవింగు లైసెన్సు లాంటిది. ప్రతిభకన్నా పట్టాకే విలువ. ఈ సందర్భంగా డా॥ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటి రూపశిల్పి, ప్రొఫెసర్ జి. రాంరెడ్డిగారు 'కోటు వేసుకుని, ప్యాంటు తొడుక్కోకుండా క్యాంపస్లో తిరుగుతుంటే జనాలు ఎలాచూస్తారో పిహెచ్.డి; లేనివారిని అలా చూస్తారని' చమత్కరించారు. ఈ ఉదంతాన్ని మా గోపీ సార్ ఉటంకిస్తూ కవిత్వం మోజులోపడి పిహెచ్.డి;ని ఉపేక్షిస్తానేమోనని హెచ్చరిస్తూ ఉండేవారు. జాషువా మీద పరిశోధన చేస్తే మరుగుజ్జు కూడా మహావృక్షమౌతాడన్న సి.నా.రె. వాక్యాల పట్ల నాకు పూర్తి విశ్వాసం.