JATEEYA PATAAKAM- GEETAM by RAVINUTHALA SREERAMULU Telugu book cover

JATEEYA PATAAKAM- GEETAM

by RAVINUTHALA SREERAMULU

₹15
In stock · 115 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
జాతి అంటే జాతి అంటే ఫలానా అని చెప్పడం కష్టం. ఒకే రక్తం కలిగిన వాండ్లందరూ ఒక జాతి అందాం అంటే ఏ గుంపు వాండ్లకూ ఒకే రకమైన రక్తం వుండదు. ఒక మతం వాళ్ళంతా ఒక జాతి అనటానికి వీల్లేదు. ఒక పరిమిత భూభాగంలో వుండేవారినే ఒక జాతిగా గుర్తిస్తాం. మతం అట్లా కాదే మరి? అది అనేక దేశాలలో వ్యాపించి వుండవచ్చు కదా? భాషను బట్టి కూడా జాతి నిర్ణయం కుదరడం లేదు. ఇంగ్లాండు ప్రజలు, అమెరికా ప్రజలు మాట్లాడే భాష ఒక్కటే-అదే ఇంగ్లీషు. ఇంగ్లీషు, అమెరికా దేశాల వారు వేరు వేరు జాతులకిందనే లెక్క ఒకేచోట నివసిస్తూ ఒకే రకమైన కష్టసుఖాలు అనుభవిస్తూ వుండేవాండ్లకు “మనమంతా ఒక్కటే” అనే భావం ఏర్పడుతుంది. అది చాలా సహజంగా కూడా వుంటుంది. జాతి. దీనినే “జాతీయత" అంటారు. భారతీయులందరూ ఒకే వీరికి కొన్ని తేడాలుండొచ్చుకాని, పై దేశాలకు పోయినప్పుడు వీళ్ళంతా ఒకటిగా వుంటారు. భారతీయ క్రైస్తవుడు ఏ దేశం వెళ్ళినా భారతీయుడే అవుతున్నాడు. రావినూతల శ్రీరాములు