
JATHAGALLU KATHAGALLU
by K.MUNI RAJU
₹70
In stock · 6 available
PublisherK.MUNI RAJU
LanguageTelugu
వీళ్లిద్దరూ మంచి జతగాళ్లు. ఇద్దరూ బి.ఎ., డి.ఎడ్. చదివి చెరొక చోట ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. మునిరాజుది హోసూరు తాలూకాలోని దేవిశెట్టిపల్లి. సురేశుది డెంకణికోట తాలూకాలోని మరదనపల్లి. వీళ్లిద్దరి తల్లుల పేరు ఒక్కటే, రామక్క సురేశు వాళ్ల తండ్రిగారు రామచంద్రారెడ్డి, ఆయన కీర్తిశేషులు. మునిరాజు వాళ్ల తండ్రిగారి పేరు కెంచప్ప. వీళ్లిద్దరూ మంచి కతగాళ్లు. వీళ్లవి ఇదివరకే నాలుగయిదు కతలు అచ్చులో వచ్చినాయి. కొత్త తీరులో కతలు చెప్పాలని వీళ్ల తపన. అవ్వమ్మలూ తాతయ్యలూ తరతరాలుగా కతల రూపంలో అందిస్తూ వస్తున్న సంప్రదాయ విజ్ఞానం కనుమరుగు కాకూడదని వీళ్ల అభిప్రాయం. అందుకే తమ పల్లెల్లోని పెద్దల నోళ్లలోని కతలను జోపానముగా ఎత్తి మనముందు పెట్టినారు. కమ్మని హోసూరు మాండలికంలోని ఈ కతలను చదువుతుంటే అవ్వ ఒళ్లో కూచునో తాత పక్కలో ముడుక్కొనో చిన్నప్పుడు మనం విన్న కతల తలపులు మళ్లీ ఒకసారి మనల్ని తడిమేసి పోతాయి.