
JATHAKAMALA
₹150
In stock · 57 available
PublisherDHARMA DEEPAM FOUNDATION
LanguageTelugu
బౌద్ధ సాహితీవేత్త శ్రీ బోధచైతన్య (ఈశ్వరవాక రామలింగం) తమిళనాడులోని పొన్నేరి సమీపగ్రామం వేళూరులో 1946లో ఒక వ్యవసాయకుటుంబంలో జన్మించారు. వీరు చెన్నై విశ్వవిద్యాలయంలో యమ్.ఏ. (తెలుగు) ఉత్తీర్ణులయ్యాక పదకొండు సంవత్సరాలు చెన్నై రామకృష్ణ మఠంలో ఆశ్రమవాసిగా ఉంటూ వారి తెలుగుపత్రిక 'రామకృష్ణప్రభ’ కు ఐదు సంవత్సరాలు సంపాదకులుగా వ్యవహరించారు. కొంతకాలం ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారు స్థాపించిన ‘Rishi Valley' స్కూల్లో తెలుగు సాహిత్యాన్ని బోధిస్తూ అక్కడి గ్రంథాలయ నిర్వాహణా భాధ్యతలను కూడా నిర్వర్తించారు. ఆ తరువాత ఎనిమిది సంవత్సరాలు చిత్తూరు జిల్లాలోని వ్యాసాశ్రమంలోనూ, శుకబ్రహ్మాశ్రమంలోనూ వేదాంతాచార్యులుగా పనిచేశారు. ప్రస్తుతం బౌద్ధ ధర్మానుయాయియై బౌద్ధసాహిత్యాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు.