JATHI NIRMATHALU by SIDDANI NAGABHUSHANAM Telugu book cover

JATHI NIRMATHALU

by SIDDANI NAGABHUSHANAM

₹40
In stock · 84 available
PublisherSIDDANI NAGABHUSHANAM
LanguageTelugu
ప్రాజెక్టుల నిర్మాణంలో పెనుమార్పులు తీసుకొచ్చిన ఇంజనీర్ కర్నల్ జాన్ పెన్నికుక్ 1857 సంవత్సరం భారతదేశ చరిత్రలో నూతనాధ్యాయం ప్రారంభ మయిందని చెప్పవచ్చు. ఇండియాలో సేవలందించడానికి గాను జాన్ పెన్నికుక్ కాడెట్ గా నమోదు అయ్యారు. క్రోడెన్ దగ్గర అడిస్ కాంబేలో మిలటరీ సెమినారీలో చేరారు. ఈ కేడెట్లు తూర్పు ఇండియా కంపెనీలో అర్టిలర్లీ, ఇంజనీరింగ్ సేవలను అందించడానికి ఉద్దేశించ బడ్డారు. తర్వాత ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు కర్నల్ జాన్ పెన్నికుక్. ఇంజనీరింగ్ విద్య పూర్తిచేసిన తర్వాత ఇండియాలో మద్రాసులో (ప్రస్తుతం చెన్నై) ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగంలో చేరారు. మద్రాసులో మద్రాసు ఇంజనీరింగ్ కార్ప్స్ కు అనుబంధంగా ఉన్న మద్రాసు సాపర్స్లో నియమితులయ్యారు జాన్ పెన్నికుక్. 1870 సంవత్సరంలో మద్రాస్ కంపెనీలో కెప్టెన్, అబిసినీయల్ కాంపైన్లో కంపెనీ తరపున పనిజేసి అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా బంగారు పతకాన్ని అందుకొన్నారు శ్రీ కుక్. యుద్ధ కార్యకలాపాలలో పాల్గొన్న తర్వాత ఇండియాకు తిరిగివచ్చిన ఆయన నీటిపారుదల ప్రాజెక్టుల పనిలో నియమించబడ్డారు. 1862 నుంచి 1882 సంవత్సరాల మధ్యకాలంలో రెండు దశాబ్దాల పాటు నీటిపారుదల సమస్యల పరిష్కారానికి ఇంజనీరు పెన్నికుక్ వివిధ రకాలుగా కృషిచేశారు. ఆ పనుల ప్రభావం రకరకాలుగా ఉన్నాయి. గతంలో ప్రాజెక్టుల నిర్మాణపు పనుల్లో పాల్గొన్న ఇంజనీర్ల, ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించారు. గతంలో కొంతమంది ఇంజనీర్లు నీటిని మళ్ళించటానికి మట్టి ఆనకట్టలను ప్రతిపాదించారు. కొంతమంది మళ్ళింపు పథకాలకు సిఫారసులు చేశారు.