JATHIYA GEETAMGA GURAJADA DESABAKTHI GEYAM by PARAKALA PATTABHI RAMARAO Telugu book cover

JATHIYA GEETAMGA GURAJADA DESABAKTHI GEYAM

by PARAKALA PATTABHI RAMARAO

₹50
In stock · 15 available
PublisherPARAKALA PATTABHI RAMARAO
LanguageTelugu
“దేశభక్తి గేయం” శతవార్షికోత్సవం మహాకవి గురజాడ "దేశభక్తి" గేయం 1910లో వ్రాశారు. రేపు 2010 సంవత్సరానికి వంద సంవత్సరాలవుతాయి. అందుచేత వాడవాడలా దేశభక్తి గేయం శతవార్షికోత్సవం జరుపుకోవడం సముచితంగా వుంటుంది. విశ్వకవి రవీంద్రుడు "జనగణమన" గేయం వ్రాయకముందే మహాకవి గురజాడ ఈ "దేశభక్తి గేయం" వ్రాయడం విశేషం. 2009-2010 సంవత్సరం పొడుగునా దేశ, కాల అవధులు లేని, ఒక అంతర్జాతీయ గేయమనదగిన దేశభక్తి గేయాన్ని ఆంధ్రప్రదేశ్లోనే కాక, తెలుగువారు ఎక్కడ వున్నా ఈ గేయం శతవార్షికోత్సవం జరుపుకోదగినది. అందుచేత మా తెలుగుతల్లికి గేయాలతోపాటు ఒక జాతీయ గీతంగా బహుళ వ్యాప్తిలోకి తీసుకురావాలి. ప్రతీ విద్యాలయంలో విద్యార్థులందరికీ ప్రార్థనా గీతంగా పాడుకొనేటట్లు చేయాలి. ప్రతీ సభలో, సమావేశాలలో పాడుకోవాలి. రచయితలు ప్రచురించే ప్రతీ గ్రంథంలో ముందు ప్రచురించాలి. అన్నిటి.వి. ఛానల్స్, ఆకాశవాణి, దూరదర్శన్ మొదలైన ప్రజా ప్రసార సాధనాల ద్వారా దేశభక్తి భావం ప్రదీప్తం చేయాలి. వైయక్తిక భక్తిసరే, దేశభక్తి మాట ఏమిటి? అన్న ప్రశ్న మార్మోగాలి. బంకిం చంద్ర ఛటర్జీ వందేమాతరం అన్నారు. మాతృదేశానికి వందనంతో సరిపెట్టుకోక ఈ దేశాన్ని, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దవలసిన కర్తవ్యాన్ని అనుక్షణం ఈ గేయం ద్వారా మనసులలో మెదిలేటట్లు చేయాలి. అభ్యుదయ భావాలు గల రచయితల సంఘాలన్నీ సమైక్య వేదికలలో ఈ విజ్ఞప్తిని ఎలుగెత్తి చాటాలి.