JAYA SHIKARAM by VEMUGANTI MURALI KRISHNA Telugu book cover

JAYA SHIKARAM

by VEMUGANTI MURALI KRISHNA

₹30
In stock · 5 available
PublisherVEMUGANTI MURALI KRISHNA
LanguageTelugu
జయశంకర్ సార్ స్ఫూర్తిని ఆవాహన చేసుకుందాం!! సంగిశెట్టి శ్రీనివాస్ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు తాత్విక భూమికను, సైద్ధాంతిక పునాదిని ఏర్పర్చిన దార్శనికుడు కొత్తపల్లి జయశంకర్ సార్. ఎవరెంత రెచ్చగొట్టినా, మానసిక దాడికి దిగినా సంయమనం కోల్పోకుండా తన వాదనను ఏమాత్రం తొట్రుపాటు లేకుండా, శషభిషలకు తావివ్వకుండా సూటిగా చెప్పే మేధావి జయశంకర్ గారు. ఏడున్నర దశాబ్దాల తన జీవితానుభవం, ఆరు దశబ్దాల ఉద్యమ చైతన్యం నేర్పిన పాఠాలతో ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని తేలికగా పరిష్కరించగల సత్తాగల మనిషి. ప్రత్యేక తెలంగాణ వాదులకు ఆయన జీవితమే ఒక స్ఫూర్తి. అలుపెరగని పోరాటానికి ఆయన ఒక చిరునామా. మొహంపై ఎప్పటికీ చెరగని చిరునవ్వుతో తెలంగాణ ఎందుకు కావాలి అనే దాన్ని సరళమైన భాషలో స్పష్టంగా, పూసగుచ్చినట్టు కొన్ని వేల సభల్లో, సమావేశాల్లో ఆయన మాట్లాడి ఉంటడు. అందులో కొన్ని పదుల సమావేశాల్లో వేదికపైనో, సభలోనో ఉండి సార్ చెప్పింది విని ఉంటా. అట్లాంటి సార్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరుకున్న ప్రస్తుత తరుణంలో లేకపోవడం కచ్చితంగా తీరని లోటే. చాలా మంది ఆయన లేకపోవడం తెలంగాణ వాదానికి, ఉద్యమానికి లోటుగా మాత్రమే భావిస్తున్నారు. నిజానికి జయశంకర్ సార్ లేకపోవడం 'హిందూ- ముస్లిం సఖ్యత'కు, 'తెలుగు-ఉర్దూ' భాషాకు, హైదరాబాద్ తెహజీబ్క తీరని లోటు. ఎన్కటి ముచ్చట్లను ఎరుక పరిచే ఒక నడిచే విజ్ఞాన సర్వస్వాన్ని కోల్పోయినట్లయింది. నిజానికి జయశంకర్ సారు ఉర్దూలో ఆలోచించి ఇంగ్లీషులో అర్థం చేసుకొని తెలుగులో మాట్లాడేవాడు. ఈ విషయాన్ని ఆయనే అనేక సార్లు చెప్పాడు. ఉర్దూ మీడియంలో చదువుకున్న వాడు కాబట్టి ఉర్దూని ఒక మతానికి సంబంధించిన భాషగా ఎవరైనా ప్రచారం చేస్తే సహించేవాడు కాదు. అది తెలంగాణ ప్రజల భాష అని చెప్పేవాడు. తెలుగు-ఉర్దూ భాషల మధ్య వారధికి ఆయన మృతితో బీటలు వారింది.