
JAYAHO KAVITHA SANKALANAM
₹100
In stock · 9 available
PublisherMUDAAR VENUGOPAL
LanguageTelugu
1. శ్రీ వైద్య శిరోమణీ! శ్రీ రాజశేఖరద్యుమణీ !! - జి. శుభాకరరావు, కర్నూలు అట్టడుగవర్గ జనుల నాడీ స్పందన తెలిసినట్లుగా వందలాది పథకాల సంక్షేమ చికిత్సలతో అన్ని రుగ్మతలను పోగొట్టే వైద్యజ్ఞానివి నీవు ! బాధాసర్పదష్టుల, భారపూరిత జీవితాల, కష్టాలు, కడగండ్ల, సకల ఖాయిలాలను మాన్సే అపర శుశ్రుతుడవు నీవు! ఖాళీ కడుపుల ఆకలి ఆర్తనాదాలని ఆలకించి, సరైన ఔషధంతో బాధా నివృత్తి చేయగలిగిన ఆధునిక ధన్వంతరివి నీవు ! ఉబికిన కళ్లను, కళ్ల గుంతల లోతులనుంచి, కారి కారి కనుకొలకులలో యింకిపోయిన కన్నీటి చారికలు కనుగొని, ఆ కళ్ళ కనీనికల చాటునున్న నిర్జీవ, నిరాశా నిస్పృహల, నిర్వేద నీలినీడల జాడలను పసిగట్టి, నీ ప్రశాంత దృక్కుల కాంతి కిరణాలతో వాటిని తరిమిన భిషగ్వరుడవు నీవు ! వేవేల వెతలతో, యాతనలతో వేదనా పరితప్త హృదయాలతో దిక్కుతోచక, గతుకుల బాటల్లో చరించే చితికిన బ్రతుకుల బడుగు జీవులకు ఆశాజ్యోతిగా అవతరించి వెలుగు దివ్వెల వైద్యాన్నందించిన అభినవ చరకుడవు నీవు ! కలలు కందామన్నా కంటికి కునుకురాని కటిక దరిద్ర నారాయణుల