JAYAHO TELANGANA by KADIYALA SURESH KUMAR Telugu book cover

JAYAHO TELANGANA

by KADIYALA SURESH KUMAR

₹80
In stock · 18 available
PublisherKADIYALA SURESH KUMAR
LanguageTelugu
తెలంగాణ తొలి దశ ఉద్యమం కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం, కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, తూర్పు గోదావరి జిల్లాలోని ద్రాక్షారామం ఈ మూడు గొప్ప పుణ్యక్షేత్రాలు. ఈ దేవాలయాల మధ్య భూ భాగాన్ని, కాకతీయులు పరిపాలించారు. వారు దీనికి త్రిలింగదేశం అని నామకరణం చేశారు. అది రానురాను కాలగమనంలో 'తెలంగాణ' అనే పదంగా మారింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్య్ర రాజ్యాలుగా కొనసాగుతున్న వాటిలో అప్పుడు హైదరాబాద్ ఒకటి. నిజాం పాలన నుంచి 1948 సెప్టెంబర్ 17న విముక్తి చెంది హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడి 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రకారం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి నిజాం పాలించిన కొన్ని జిల్లాలను వేరు చేస్తూ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచాలని మొదలైన ఉద్యమం ఇది. ఇది దాదాపు 50 సంవత్సరాల నుండి కొనసాగుతున్నది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం 1953 డిసెంబర్లో రాష్ట్రాల పునర్విభజన కమీషన్ను నియమించడం జరిగింది. ప్రజాభిప్రాయం ప్రకారం ఈ కమీషన్ హైదరాబాద్ రాష్ట్రాన్ని విభజించి అందులో మరాఠీ భాష మాట్లాడే ప్రాంతాలను బొంబాయి రాష్ట్రంలోనూ, కన్నడ భాష మాట్లాడే ప్రాంతాలను మైసూరు రాష్ట్రంలోనూ కలిపివేయాలని సిఫారసు చేసింది. అయితే ఈ కమీషన్ నివేదిక హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయడం వలన కలిగే లాభనష్టాలను చర్చించి విలీనానికి మద్దతుగా ఆంధ్ర భాగంలో ఎక్కువగా ఉన్నప్పటికీ తెలంగాణ భాగంలో స్పష్టంగా లేకపోవడంతో తెలంగాణ భాగాన్ని హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పాటు చేసి సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రం ప్రజాభిప్రాయం ప్రకారం విధానసభలో విలీనం తీర్మానానికి మూడింట రెండువంతుల ఆధిక్యత వస్తే విలీనం జరపాలని సూచించారు. అప్పటికే జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం పెద్దమనుషుల ఒప్పందం ద్వారా తెలంగాణ భద్రతను అందించడం తర్వాత 1956 నవంబర్ ఒకటో తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరియు తెలంగాణ విలీనం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన కొన్నాళ్లకే మళ్ళీ వేర్పాటు ఉద్యమాలు తలెత్తాయి.