
JAYAMU RAITHA - TRISATHI
₹100
In stock · 93 available
PublisherPONNADA VARAHANARASIMHULU
LanguageTelugu
విశ్వసాహితి మాట! విశ్వసాహితి, ఆమదాలవలస 1978 సంవత్సరం ఫిబ్రవరి నెలలో స్వర్గీయ గెడ్డాపు సత్యం మాస్టారు, రామారావునాయుడు గార్లు అధ్యక్ష కార్యదర్శులుగా నెలకొల్పబడింది. ఉపాధ్యాయ పత్రికా సంపాదకులు గౌ|| శ్రీ సువ్వారి అచ్చెన్నాయడు, శ్రీ బొడ్డేపల్లి అప్పలనాయుడు, శ్రీ అధికార్ల నీలకంఠం, శ్రీ నల్లబాటి సత్యనారాయణా చార్యులు, శ్రీ భద్రం వేణుగోపాలాచారి, శ్రీ ఉప్పాడ సత్యనారాయణ, శ్రీ కె. మోహన రావు, శ్రీ కొటికలపూడి నరసింహ మూర్తి మొదలగు వారు సభ్యులుగా కొనసాగారు. 1993 నవంబరులో 169/93 రేఖా సంఖ్యతో ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థగా అవతరించింది. అప్పటి నుండి విరివిగా సాహితీ సభలు, గోష్ఠులు, చర్చలు, కవితా పోటీలు, కావ్య సమీక్షలు యిత్యాది సాహితీ కార్యక్రమాలు జరిపిస్తూ, లబ్ధ ప్రతిష్ఠులైన కవులకు, రచయితలను, పండితులను ఆహ్వానించి సాహితీ ఉపన్యాసాలిప్పించుట, యువ రచయితలకు సూచనలు, సలహాలు అందించుట, వారిని సన్మానించి, ప్రోత్సహించుట, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుట జరుగుచున్నాము. కవితా పోటీలు నిర్వహించి, విజేతలను సత్కరించండం, యువకవులను ప్రోత్సహించడం జరుగుతుంది. ప్రతి రెండవ శనివారం సాయంత్రం గం|| 6-00లకు ఆమదాలవలస లోని సాహితీనగర్ (బి.ఆర్.నగర్) నందు గల శ్రీ పొన్నాడ అప్పలనరసమ్మ-చిన్నవాడు గ్రంథాలయంలో సాహితీ సమావేశాలు జరుగుచున్నాయి. సాహితీ సభ్యులు రాసిన అనేక గ్రంథాలను యీ సమావేశాల్లో ఆవిష్కరించటం జరుగుతుంది. అంతటితోనే గాకుండా, పుస్తక ప్రచురణా రంగమునందు కూడా అడుగిడి 1. మా ఊరుమట్టి (వచన కవిత్వం), 2. తెలుగు ధీర త్రిశతి (పద్య కవిత్వం) ముద్రించి ఆవిష్కరించటం జరిగింది.