
JAYAPRADAM
by DR.PELLAKURU JAYAPRADA SOMIREDDY
₹200
In stock · 48 available
PublisherDR.PELLAKURU JAYAPRADA SOMIREDDY
LanguageTelugu
“జయప్రదంగా సాగిన డా॥ జయప్రద సాహితీ స్వర్ణోత్సవం” + కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి అర్థశతాబ్ది పైగా అవిశ్రాంతంగా 'జయప్రదం'గా సాహిత్య ప్రక్రియ లన్నిటిలోను కదిలిన కలానికి సాహితీ స్వర్ణోత్సవం జరుపుతున్న సందర్భ| మిది. సాహిత్య పుటల్లో చెరిగిపోని సంతకం చేసిన ఆదర్శనీయ మైన | సమర్థవంతమైన రచయిత్రి, కవయిత్రి సంపూర్ణ సాహిత్యంపై విశ్లేషణ నాత్మకమైన పత్రసమర్పణలు గావించిన అంశాలను అనుభూతుల్ని 17.3.2013 న ఆరవోసుకుంటున్న సాహితీ స్వర్ణోత్వవ సభ అది. ఊపిరి సలుపని వైద్యవృత్తిలో ఈదుతూనే ఎన్నో సృజనాత్మక రచనలకు ప్రాణం పోసిన సుప్రసిద్ధ సాహితీ ప్రజ్ఞావంతురాలు డా|| పెళ్లకూరు జయప్రద. అక్షరాన్ని ఆయుధంగా మలుచుకొని మానవీయతను మరుగుపరచే సంప్రదాయాల్నీ, మూఢ విశ్వాసాల్నీ నిరోధించే సశాస్త్రీయమైన ఆలోచనా విధానాల్ని, సహేతుకమైన పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ప్రయత్నించిన చైతన్య పిపాసి ఈమె. ఈమె సాహిత్య సంపుటాలు పటిష్టమైన మైలురాళ్ళుగా సాహితీ రంగంలో దర్శనమిస్తున్నాయి. ఈమె సాహిత్య యానంలో కొత్త కొత్త భావాలు అలుపు లేకుండా అలలు అలలుగా తెలుగు సాహిత్య తీరాన్ని తాకుతూనే వున్నాయి. ఈ "సాహితీ స్వర్ణోత్సవం" సందర్భంగా, పలువురు సాహితీ ప్రముఖులు అందించిన సాహిత్య సౌరభాలు, స్నేహశరశ్చంద్రికలు, ఆనందపు హరివిల్లులు, అక్షరాశీస్సులు డా॥ జయప్రదగారి కవితా హృదయాన్ని స్పర్శించి ఆమెలో నూతనోత్సవాన్ని ద్విగుణీకృతం చేస్తుందని నమ్ముతాను. ఈ స్వర్ణోత్సవాన్ని సాహిత్యపరంగా పునరంకిత పునరుత్తేజ ఉత్సవంగా ఆమె భావించాలని ఆశిస్తాను. మరో కొత్త సాహిత్య సృష్టికి వాగ్దానంగా స్వీకరించాలని డా॥ జయప్రదగారిని కోరుకుంటాను. ఇప్పటికే ఈమె సాహిత్యాన్ని ప్రతిష్టాత్మకమైన పురస్కారాలెన్నో పలకరించి ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నాయి. అందులో కొన్ని అవార్డులు. 1. ఇదా నువ్విచ్చే తీర్పు (కథా సంకలనానికి) బెస్ట్ షార్ట్ స్టోరీ రైటర్ అవార్డు, గుంటూరు 1993 2. 'నెల్లూరు నుండి ఉరికింది' అనే సారానిషేధ వ్యాసానికి కళ్యాణి అవార్డు హైదరాబాద్ 1994 3. 'సందిగ్ధం నాటికకు' ఆకాశవాణి కమాండేషన్ సర్టిఫికేట్ విజయవాడ - 1994 4. ఆంధ్రా మెడికల్ కాలేజ్ స్టూడెంట్ పురస్కారం - విశాఖపట్టణం 2002 5. మనసుకు మరణం (దీర్ఘ కావ్యం)కు ఆల్ ఇండియా పొయిటర్స్ ఆర్గనైజేషన్ మహారాష్ట్ర 2003 6. ఇంధ్రధనుస్సు (కవితా సంకలనం)కి హైదరాబాద్ 2004 7. ఎక్స్రే అవార్డు విజయవాడ - 2004 8. మహిళా పురస్కారం మాతా శిశు సంక్షేమశాఖ పురస్కారం- హైదరాబాద్ 2004 9. ఎక్సలెన్స్ అవార్డు - ఫ్రెండ్షిప్ ఫోరమ్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ 2005 10. ఉగాది పురస్కారం కలెక్టర్, నెల్లూరు 11. కళాంజలి పురస్కారం నెల్లూరు 2007 12. బెస్ట్ డాక్టర్ ఎండ్ రైటర్ అవార్డు విత్ హ్యుమనటేరియన్ టచ్. ఇన్స్టర్నేషనల్ హెల్త్ ఆర్గనైజేషన్ -హైదరాబాద్ 2008 6 డా॥ జయప్రద సాహితీ స్వర్ణోత్సవ సంచిక √యప్రదం.."