
JAYASANKARA YADI MARUVANI PAATALU
₹40
In stock · 7 available
PublisherJULURU GOWRI SHANKAR
LanguageTelugu
తెలంగాణ సాంస్కృతిక ఉద్యమ తల్లిపేగు జయశంకర్ ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆర్థిక శాస్త్రాన్ని అధ్యయనం చేసి బోధించిన వాడు. రాజకీయ శాస్త్రాన్ని ఆపోసన పట్టినవాడు. రాజకీయ, ఆర్థిక, సామాజిక శాస్త్రాలను సాహిత్యానికి అన్వయించి సాంస్కృతిక రంగానికి తెలంగాణ తాత్విక పునాదులు వేసినవాడు. కాళోజీ, జయశంకర్ లు ఇద్దరు వరంగల్ వాళ్లు, ఇద్దరు తెలంగాణ ఉద్యమానికి రెండు స్తంభాల్లాంటివాళ్లు. కాళోజీకి సాహిత్యరంగంపై ఎంత పట్టుందో రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై అంతే పట్టు వుంది. అట్లాగే ఉ పాధ్యాయ, అధ్యాపక నాయకుడిగా, పరిపాలనా దక్షుడిగా, తెలంగాణ సిద్ధాంతకర్తగా నిలిచిన జయశంకర్కు సాహిత్యరంగంపై గట్టి పట్టు వుంది. ఇది ఆ తరం వారికే సాధ్యమైందనుకుంటాను. జయశంకర్ భాషా శాస్త్రవేత్త కాకపోయినప్పటికీ భాషకు సంబంధించి, ఉర్దూకు సంబంధించి, ఉర్దూ తెలుగు కలగలసిన భాషా సౌందర్యం గురించి ఆయన పదే పదే చెప్పేవాడు. ఉర్దూ పదాల్లో వున్న గొప్పతనాన్ని ఆయన అనేక సాహిత్య సభలలో చెప్పేవాడు. తనకు తెలియకుండగానే తెలంగాణ రచయితల వేదికకు ఒక సాంస్కృతిక భూమికను అందించాడు. జయశంకర్ యిచ్చిన, చూపిచ్చిన దారిలోనే తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక ఉద్యమం ముందుకు సాగుతుంది. ఈనాడు జయశంకర్ ప్రతిపాదించిన సాహిత్య, తాత్త్విక పునాదితోనే కొన్ని వందల కలాలు తెలంగాణ ఉద్యమ కొలిమిని రాజేస్తూ అక్షరాయుధాలుగా మారాయి. చర్శి మలిదశ తెలంగాణ ఉద్యమం ఊపందుకుంటున్న తరుణంలో సాహిత్య, సాంస్కృతిక రంగాన్ని పటిష్టం చేయడానికి జయశంకర్ ఎంతో కృషి చేశారు. గద్దర్ లాంటి వ్యక్తులను కలిసి తెలంగాణ ఉద్యమానికి సాంస్కృతిక గజ్జె కట్టాలని కోరాడు.