JEENOM SAPTAMA ANTHARDHANAM by DR.L.S.R.PRASAD Telugu book cover

JEENOM SAPTAMA ANTHARDHANAM

by DR.L.S.R.PRASAD

₹100
In stock · 9 available
PublisherDR.L.S.R.PRASAD
LanguageTelugu
ఇదెలా జరిగిందో ఎవరికీ అర్థం కావడం లేదు. ముందు చిన్ని అనుమానం. తర్వాత కొంత పరిశోధన. వచ్చిన డేటాను చూస్తే మతి పోయింది. డా. మాయాదత్ మరోసారి కంప్యూటర్ డేటాను విశ్లేషించసాగింది. ఇదెలా సాధ్యం? ఆర్నెల్ల క్రితం ఓ మెడికల్ అసోసియేషన్ మీటింగులో ఓ బిజీ డాక్టరు ఏంటోనోయ్! మా హాస్పిటల్లో యీ నెల అంతా ఆడపిల్లలే పుట్టారు' అంది. ప్రక్కనున్న మరో కార్పోరేట్ హాస్పిటల్ డైరెక్టరు..... "మా హాస్పటల్లోనూ అంతే... అన్నాడు. అందరూ ఆడపిల్లలే పుడుతున్నారన్నది మొదట పుకారను కున్నా, కొద్ది నెలల్లోనే అది రూమర్ కాదనీ, పచ్చినిజమనీ తేలింది. యింకే ముంది? గందరగోళమే! గత ఆర్నెల్లుగా ప్రపంచంలో మగ శిశువే జన్మించ లేదని నిర్ధారణకు వచ్చేసరికి మొత్తం వైద్యప్రపంచం విస్తుపోయింది. శాస్త్రజ్ఞులు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వాలు కలవరపడి ఎమర్జన్సీ డేటాప్రాసెస్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రతి కాన్పు వెంటనే నమోదు అయ్యేట్లు, ఆ సమా చారం ప్రపంచమంతటా అందేట్లు ఏర్పాటుచేసాయి. పాపులేషన్ క్లాక్ (జనాభా గడియారం)చూపించే అంకెలు చూస్తుంటే యీ ఆర్నెల్లల్లోనే మన దేశ జనాభా లో ఎంత మార్పు వచ్చిందో అర్థమవుతుంది.