JEERNAKOSA AAROGYAM by SREE MADHULATHA PUBLICATIONS Telugu book cover

JEERNAKOSA AAROGYAM

by SREE MADHULATHA PUBLICATIONS

₹80
In stock · 1 available
PublisherSREE MADHULATHA PUBLICATIONS
LanguageTelugu
ముందుగా మూడు ముక్కలు గొంతుద్వారా మనం తీసుకునే ఆహారం గొంతు ద్వారా జఠరాశయంలోకి వెళ్ళి జీర్ణమై చిన్న ప్రేగుల గోడలలో జీర్ణమైన ఆహారం రక్తంలోకి ప్రవేశించబడి వ్యర్ధాలు పెద్ద ప్రేగులు గుదము ద్వారా బయటకు విసర్జింపబడతాయి. జీర్ణం కావడంలో, విసర్జింపబడడంలో ఇబ్బందులెదురైతే, వెంటనే వాటిని వైద్యుల సహకారంతో సరిద్దిద్దుకోవాలి. లేకపోతే రకరకాల ఆరోగ్య ఇబ్బందుల్ని ఎదుర్కొవలసివస్తుంది. అందుకని చికిత్స కన్నా అనారోగ్యాలు కలుగకుండా చూసుకోవడం మంచిదనే ఉద్దేశంతో ఆహారనాళం, ఆహారం జీర్ణక్రియ, విసర్జన క్రియ ఆయా అవయవాలలో ఇబ్బందులు, అవి ఎందుకు వస్తున్నాయి? రాకుండా చూసుకోవడం ఎలా? వస్తే ఎలాంటి చికిత్సలున్నాయి? అనే వివరాల్ని ఈ చిరుగ్రంధంలో పొందుపరచడం జరిగింది. అందరికీ ఈ వివరాలు ఎంతగానో తోడ్పడతాయి. డా॥ గోవింద్ ఆర్.వర్మ, హైపలాజిస్ట్ డా॥ రావుల ఫణికృష్ణ, లివర్ మార్పిడి శస్త్ర చికిత్సా నిపుణులు ఒకరు, గాస్ట్రోఎంటరాలజిస్ట్, మరొకరు సర్జికల్ గాస్ట్రో ఎంటారాలజిస్ట్ కాబట్టి ఆహారనాళం గురించి రెండు ప్రక్కలా -మెడికల్ సైడ్, సర్జికల్ సైడ్ -రెండు వైపులా వివరాల్ని సంపూర్ణంగా ఇవ్వగలిగారు. ఇద్దరూ మంచి అనుభవమున్న వైద్యులు. అనారోగ్యాన్ని ఎలా పసిగట్టవచ్చో బాగా తెలిసిన వారు. అవసరమైన పరీక్షలతో త్వరగా ఇబ్బందిని పసిగట్టి అవసరమైనంత వరకు మాత్రమే మితంగా మందులు వాడేవారు. కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఫలితం లేకపోయినప్పుడే శస్త్ర చికిత్స గురించి ఆలోచిస్తారు. వీలైనంత వరకు తక్కువకోతలతో జరిపే మినిమల్లీ ఇన్వేజివెక్నిక్స్ర్స్నే శస్త్రచికిత్సకు ఉపయోగిస్తారు. ఇద్దరూ కలిసి హైదారాబాద్ బేగం పేట పాతహెయిర్పోర్టు ప్రాంతంలో పేస్ హాస్పిటల్ని ప్రారంభించి విశిష్ఠ సేవల్ని అందిస్తున్నారు. ప్రజలకు కావలసిని ఆరోగ్య సదుపాయాల్ని అందించడంతో బాటు, ప్రజలలో ఆరోగ్యం పట్ల అవగాహనను పెంచడం తమ సామాజిక బాధ్యతగా భావిస్తున్నారు. వీళ్ళిద్దరూ కలసి "మన ఆరోగ్యం" మాసపత్రికలో రాసిన వ్యాసాల్ని మధులతా పబ్లికేషన్ ఇలా ఓ గ్రంథంగా తీసుకురావడం ఆనందించాల్సిన విషయము. ఇలా ఆహారము, ఆహార నాళానికి సంబంధించిన అన్ని విషయాల్ని ఒకచోటికి చేర్చడం సంతోషించాల్సిన విషయం. ఈ విషయాలు మనందరికి ఎప్పటికి కావాలి. అందుకని తెలుగులో ఒకచోట ఇలా అందిస్తున్న డా॥ గోవింద్ ఆర్ వర్మ, డా॥రావుల ఫణికృష్ణ గారలకు మన ఆరోగ్యం పత్రిక, మధులత పబ్లికేషన్స్ వారికి నా శుభాకాంక్షలు. 'ఈ వ్యాసాలు వివిధ సందర్భాలలో రాసినవి కొన్ని విషయాల పునరుక్తి దోషం ఉండవచ్చు. కొన్ని చోట్ల రేఖామాత్రంగా రాసిన విషయాలు మరో చోట వివరంగా ఉండవచ్చు. అందుకే అలా వదిలేశాం. అన్ని రకాల ఆరోగ్యవిశేషాల్ని మనకు దాదాపు పదేళ్ళనుంచీ అందిస్తున్న మన ఆరోగ్యం ఒక్కో అవయవం లేక సిస్టమ్కి సంబంధించిన విషయాల్ని అన్నింటినీ ఇలా పలుగ్రంథాలుగా ప్రజలకు చేర్చాల్సిన అవసరముందని భావిస్తున్నాను. అందరికి ఆరోగ్య శుభాకాంక్షలతో శెలవు మీ వేదగిరి రాంబాబు