JEEVADHARA 1857 SPURTHI RACHANALA SANKALANAM by PRAJA SAHITYA VEDHIKA Telugu book cover

JEEVADHARA 1857 SPURTHI RACHANALA SANKALANAM

by PRAJA SAHITYA VEDHIKA

₹100
In stock · 1 available
PublisherPRAJA SAHITYA VEDHIKA
LanguageTelugu
1857 - నెమరువేయి బహుశ తగిన సమయంలోనే మనం గత కాలం గురించి మాట్లాడుకుంటున్నాం గత కాలం వర్తమానం ఎట్లా అయ్యిందో, వర్తమానం గతకాలం ఎట్లా అవుతుందో గత వర్తమానాల, మీదుగా భవిష్యత్తు ఎలా వీస్తుందో - బహుశ తగిన సమయంలోనే మనం చరిత్రను తవ్వి తలకెత్తుకుంటున్నాం ఒక వారసత్వాన్ని ఒక అమూల్య విలువని, రక్తంలో జీర్ణించుకున్న, ధ్వనిస్తున్న జాతి జీవన సారాన్ని తగిన సమయంలోనే మననం చేసుకుంటున్నాం - సమీప గతం తెలియని ఒకతరం విరిగి ముక్కలు ముక్కలవుతున్న ఒకతరం మనముందు కదిలిపోతూ వుంది. ఒక పోరాట చరిత్రని కొన్నివేల సంవత్సరాల మానవ స్వేచ్చా ఆకాంక్షకి రూపం ఇచ్చిన ఘటనని ఇప్పుడు దోసిట్లోకి తీసుకుని, అద్దంలోలా మన ముఖ ప్రతిబింబాన్ని చూసుకుని కనుబొమ్మలు దిద్దుకుంటానికో గాలికి ఊగుతున్న అలకల్ని సర్దుకుంటానికో - విరిగి పోతున్న కలలకు ఒక సంజీవనీ స్పర్శ యివ్వటానికో దేనికీ ఒక కేంద్రం కనబడటం లేదు