
JEEVAM GNANAM UG KRISHNAMURTHYTHO SAMBASHANALU
₹100
In stock · 12 available
PublisherRAJASHEKAR PALADUGU
LanguageTelugu
ఓ మానవ పుష్పం బుద్ధుడు, జీసస్, రమణ మహర్షి, ఆనందమయి మాతల లానే యూజీ ఓ మహర్షి, బుద్ధుడు, జీసస్ చైతన్యానికి సజీవసాక్ష్యంగా యూజీ తనను పేర్కొనడం ఈ సంభాషణల్లో ముఖ్యమైన విషయం. ఆయన ఇలా అన్నారు. 'ఇక్కడ, ఈ స్థితి వేరు. ఇది సహజ స్థితి. బుద్ధుడు, జీసస్, ఇంకా ఆలోచనా కట్టడాల నుంచి బయటకు అడుగుపెట్టిన వాళ్ళందరి స్థితి ఇదే' అయితే ఇక్కడ ఋషులను, వారి బోధనలను పోల్చి చూడడం, తారతమ్యాలు వెతకడం, లేదా వారి జీవన మార్గాలను ఒకేలా చూడడం చేయనవసరం లేదు. జాజి, గులాబి, మల్లెలు ఎలా వాటి పరిమళాన్ని వెదజల్లుతాయో, అలానే మానవ పుష్పం అయిన ప్రతి ఋషి వైఖరి అద్వితీయంగా, భిన్నంగా ఉంటుంది. కాని వారి వారి ప్రధాన సందేశాలు ఎప్పుడూ దుఃఖాన్ని అంతం చేసి, మానవాళిని అవిభాజ్య చైతన్యం వైపుకు నడిపించడమనే ఒకే లక్ష్యం వైపే ఉంటాయి. ఈ ఋషులందరూ వాస్తవంగా భగవంతుని దూతలు, మీరు 'రక్షకు'లని భావించే వాళ్ళు. సంప్రదాయ పరంగానో, మతపరంగానో లేదా ఏదో ఓలాంటి ప్రత్యేక భావనతోనో అలా అనడం లేదు. జీవన రహస్యాలను, వింతలను తీసుకు వచ్చి, దుఃఖ కారణమైన 'అహం'నూ, ఆలోచనా నిర్మాణాలనూ ముగింపజేసి, దుఃఖాన్ని అంతం చేసే అవకాశముంటుందని సూచించడం వల్ల వారినలా భావించవచ్చు. కాని వారినో పూజా పీఠంపై ఉంచి, దేవుళ్ళుగా అవతార పురుషులుగా పూజించడంతో వారి వాస్తవ సందేశాలను కోల్పోయాము. వాటికి బదులు వైరుధ్యాలకి, హింసకి, దుఃఖానికి మూలమైన నమ్మకాల, విశ్వాసాల కట్టడాల్ని సృష్టించాము. అది మార్గం కాదు. 'మనం వాళ్లను అనుకరించాలని చూస్తాము. అది మనకు సహాయపడదు' అంటారు యూజీ. నీవో మంచి పని చేయడం, దయగా ఉండడం, దేన్నో వదులుకోవడం, ఏదో ఓ పద్దతిలో ప్రవర్తించడం ఇవన్నీ మహర్షులను అనుకరించడమే.