JEEVANA CHITRALU by K.SURYA KUMARI Telugu book cover

JEEVANA CHITRALU

by K.SURYA KUMARI

₹40
In stock · 6 available
PublisherK.SURYA KUMARI
LanguageTelugu
జీవన చిత్రాలు ప్రిన్సిపాల్ రఘురామ్ ఫోను తీసుకున్నాడు. "హల్లో! నాన్నా! నేను సవీని. ఒక్కసారి అమ్మను పిలిపించరా!" స్టాఫ్ రూంకు, ప్యూనును పంపించి, యశోధరను పిలిపించేడు రఘురాం. "అమ్మా! యం.టెక్. ఫలితాలు వచ్చేయమ్మా!" "ఆ! నువ్వు పాస్ అయేవుగా!" "ఊహు! లేదమ్మా! ఇలాజరుగుతుందనుకోలేదు." నవీన్ గొంతులోని కొంటెతనం ఇట్టే పసిగట్టేసింది యశోధర. 'నువ్వు పాస్ అవకపోపటమేమిటి? ఇంక తమాషా మానేసి నిజం చెప్పు" ఇంక అమ్మను బాధపెట్టదలుచుకోలేదు నవీన్. 'ఊరికే నీవేమంటావోనని అన్నానమ్మా! ముందుగా నీకే చెప్పాలని నాన్నకు కూడా చెప్పలేదింకా ఏమనుకోవద్దను "చాలా సంతోషం నాన్నా! మీ నాన్నకు నేను చెప్తానులే. ఏమనుకోరు." "ఈపూటకు సెలవు పెట్టేయమ్మా! నేను వచ్చి నిన్ను తీసుకువెడతాను." గారాలు పోతూ అడిగేడు తల్లిని. "సరే! తొంబరగా రా!" ఫోను పెట్టేసింది యశోధర. భర్తకు విషయం చెప్పి సెలవు పెట్టి కొడుకు రాక కొరకు ఎదురు చూస్తూ కూర్చుంది. నవీన్ స్కూటరు మీద కాలేజీకి వచ్చేడు. తిన్నగా తండ్రి దగ్గరకు వెళ్ళి, సంతోషంగా, తన 'రిజల్టు' విషయం చెప్పేడు. తల్లిని తీసుకుని ఇంటికి బయలుదేరేడు. వారిలో స్కూటరాపించి, యశోధర స్వీట్లు కొంది. లోపలకు వెళ్ళేక, కొడుకు నోటికి స్వీట్ అందించింది మురిపెంగా. "అమ్మా! మరినీకో" అంటూ తల్లి నోటికి అందించేడు. డైనింగ్ టేబుల్ దగ్గర కూచుని కాఫీ తాగుతూ తల్లీ కొడుకులు కబుర్లలో పడ్డారు. "నవీన్! వాదొక కోరిక మిగిలిపోయిందయ్యా! ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నావు." "ఏమిటమ్మా అది? చెప్పు." అని నవ్వుకుంటూ సర్దుకు కూర్చున్నాడు.