
JEEVANA DAARSANEEKUDU VEMPALLE SHARIFF
by SOWBHAGYA
₹60
In stock · 29 available
PublisherSAAFIR PUBLICATIONS
LanguageTelugu
'అచట పుట్టిన చిగురు కొమ్మయిన చేవ' అన్నాడు అల్లసాని పెద్దన. వేంపల్లె షరీఫ్ అక్కడ పుట్టాడు. జీవితంలోని చేదుని స్వీకరించి జీవించే శక్తిని పెంచుకున్నాడు. అతని కథల్లోకి వెళ్లే ముందు మన అభిప్రాయాల్ని, స్థాయిల్ని బయటే వదిలి వెళ్లాలి. అప్పుడే మనం అతని దర్శనశక్తికి ముగ్ధులవుతాం. అతను ఒక వర్గానికి, ప్రాంతానికి పరిమితమైన కథకుడు కాదు. అతను ప్రపంచానికి చెందినవాడు. షరీఫ్ అభినందనలకు, అభిశంసలకు లొంగేవాడు కూడా కాదు. సంతృప్తి నిండిన సంపూర్ణ మానవుడు. భర్తృహరి 'సంతోషంగా ఉన్నమనిషిని బంగారు కొండ ఎక్కించినా అతనికి ఆ బంగారు కొండ పట్ల కోరిక వుండదు, ఆశపోతును బంగారు కొండ ఎక్కిస్తే దాన్ని మించింది యింకేదో కావాలని ఆరాటపడతాడు' అన్నాడు. షరీఫ్‌ను నేను అదనంగా సంతోష పెట్టలేదు. ఈ వ్యాసాల్లో కేవలం నా ఆనందాన్ని పంచుకున్నాను. అంతే.