
JEEVANA DUKKHA VIMUKTHI MARGALU
₹80
In stock · 10 available
PublisherMAITREYA PUBLICATIONS
LanguageTelugu
ముందు మాట జీవిత దుఃఖ విముక్తి మార్గాలు: ఆధ్యాత్మకతకు పునాది. పూర్వం నుండి అపూర్వంగా సాధకులు సాధన చేస్తూ, తన్మయత్వంలో తమను తాము మర్చిపోయేవారు. శ్రవణ సాధనతో జన్మ జన్మల సంబంధాలు తెల్సుకొని ప్రపంచంలో భక్తులు భక్తి పారవశ్యంలో ఉన్నప్పుడు సత్యంతో సత్యమై ఎలాంటి చిత్తం లేకుండా ఆనందంలో బ్రతికేవారు. శారీరక, మానసిక బాధల నుండి విముక్తిని పొందేవారు. దుఃఖం నుండి విముక్తి పొందిన తరువాత వచ్చిన ఆనందం బీజంలా సాధకుల జీవనంలో ఉండేది. బీజం మొలకెత్తి వటవృక్షంలా పెరిగి తన రెక్కల కొమ్మలను విశ్వంలో పరిచేది. సత్యంను ప్రేమించి భ్రమల్లోంచి బయటపడేవారు. ఆధ్యాత్మిక ఆరోగ్య సూత్రాలతో శాంతియుతంగా జీవించేవారు. అన్ని సమస్యలకు నిర్మూలనా మార్గాలను అన్వేషించి అంతర్ముఖీనులై ఆనందంగా జీవించేవారు. ఆధునిక సమాజంలో అలాంటి మార్గాలు ఈ పుస్తకంలో పొందుపర్చబడినవి. ఈ మార్గాలను చిత్తశుద్ధితో పాటించడం వలన మనస్సులో ఉన్నటువంటి మలినాలన్ని తొలగి తమను తాము అద్దంలో చూసుకొన్నట్లుగా ఆత్మజ్ఞానాన్ని పొంది సచ్చిదానందులు కాగలరు. ఈ ప్రపంచంలో అందరూ ఆనందం కోసం బ్రతుకుతున్నారు. కాని అన్వేషించే మార్గాలు అందుబాటులో లేనందువలన ప్రజలంత దుఃఖంతో బ్రతుకుతున్నారు. అందువలన అనేక రోగాలకు ప్రధానంగా ఏయిడ్స్, మధుమేహం, క్యాన్సర్ లాంటి రోగాలకు భారతదేశం కేంద్రమైపోయింది. సత్సంబంధాలు సరిగా లేకపోవడం వలన శాంతి లోపించినది. అందువలన ధ్యానయోగ మార్గాలను చూపెడుతూ సప్తవర్ణాశ్రమ ధర్మం ధ్యానయోగం ద్వారా ఆ పరమ సత్యాన్ని తెల్సుకొనే అనేక మార్గాలను పుస్తకంలో వివరించడం జరిగింది. మిత్ర వాక్యం ప్రేమతో రాసినట్టువంటి ఆచార్య కోవెల సుప్రసన్నాచారి గారికి మరియు పుస్తకాన్ని అందంగా తీర్చిదిద్దిన సహచరులకు నా కృతజ్ఞతలు.