JEEVANA JYOTHI KATHALA SAMPUTI by POTTURI VIJAYALAKSHMI Telugu book cover

JEEVANA JYOTHI KATHALA SAMPUTI

by POTTURI VIJAYALAKSHMI

₹100
In stock · 3 available
PublisherNAVODAYA BOOK HOUSE
LanguageTelugu
జీవన జ్యోతి ఫోన్ మోగింది. వంటింట్లో వున్న సుధా, బెడ్రూంలో వున్న మూర్తీ ఇద్దరూ "హారి దేవుడా. మళ్లీ వచ్చింది" అని విసుక్కున్నారు. "ఎవరో చూడండి. ఎవరైనా సరే, నా గురించి అడిగితే లేనని చెప్పండి" అని అరిచింది సుధ. "ఆ పని నువ్వే చెయ్చి. ఫోన్ తీసి నేను లేనని చెప్పు" అని అరిచాడు మూర్తి. వీళ్లిలా గొడవ పడుతూ వుంటే ఫోన్ ఆగిపోయింది. 'అమ్మయ్య బతికాం' అనుకున్నారు. నిజమే మరి వాళ్లు చాలా క్లిష్ట పరిస్థితుల్లోనే ఉన్నారు. అమెరికా ప్రయాణం. దగ్గరకొచ్చేసింది. పై వారం ఈపాటికి ఈ గాల్లో వుండాలి. ఇక్కడ చక్కదిద్దుకోవాల్సిన వ్యవహారాలూ ఎంతకీ తెమలటం లేదు. ఫోన్లు విసిగించేస్తున్నాయి. 'అమెరికా ప్రయాణంట కదా! ఎప్పుడు వెళ్తున్నారు! ఎప్పుడొస్తారు? ఇక్కడన్నీ సర్దుబాటు చేశారా? జాగర్త మరి. మన రామం వాళ్లు వెళ్తూ ఇంటర్నెట్ డిస్కనెక్ట్ చెయ్యమని చెప్పటం మర్చిపోయారు. ఆరు నెలల తరువాత వచ్చాక చూసుకుంటే ముప్పై వేలు బిల్ వేశాడుట పెనాల్టీతో కలిసి. వాళ్ల చుట్టూ తిరిగి చివరికి కన్స్యూమర్ ఫోరంకి వెళ్లి సెటిల్ చేసుకున్నారు." "ఇన్సూరెన్స్ విషయంలో బద్దకించకండి. పాపం సూర్యంగారు ఇలాగే గుండు పిక్కలా ఉన్నాను అనుకుని దగ్గుకీ తుమ్ములకీ మాత్రమే పనికొచ్చే చవక రకం ఇన్సూరెన్స్ చేయించుకుని అక్కడికెళ్లాక గుండె పోటొచ్చి పడిపోతే ఆపరేషను చేయించుకోవాల్సి వచ్చింది గుర్తుందా! ఆ ఆపరేషను చేయించి అప్పటిదాకా అమీరుగా వున్న ఆయన కొడుకు కాస్తా దెబ్బకి పకీరు అయిపోయాడు పాపం" అని సలహాలు గుప్పిస్తున్నారు కొందరు. "మా పిల్లలకి ఓ రెండు కిలోల పాకెట్ పట్టుకెళ్తారా?" అని అర్థిస్తున్నారు మరి కొందరు. ల్యాండ్లైన్ ఆగిందని ఆనందపడేలోగానే సెల్ మోగటం మొదలుపెట్టింది. చూశాడు మూర్తి, రవిప్రకాష్ పేరు కనిపించిది. జీవన జ్యోతి