JEEVANA KIRANALU by CHEPYALA MALHAL RAO Telugu book cover

JEEVANA KIRANALU

by CHEPYALA MALHAL RAO

₹50
In stock · 8 available
PublisherCHEPYALA MALHAL RAO
LanguageTelugu
నా మనవి గౌరవనీయులైన సాహితీవేత్తలకు, ప్రియమైన తెలుగు పాఠకులకు, సహృదయులైన శ్రేయోభిలాషులకు పుస్తకం రూపు దిద్దుకోవడానికి సహకరించిన వారందరికి, పుస్తక విక్రేతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మహానీయుల పుస్తకాలు చదువుతున్నపుడు అందులోని నన్ను ప్రభావితం చేసిన కొన్ని కొన్ని వాక్య సమూదాయాలను వ్రాసుకోవడం నాకు అలవాటు, అలా వ్రాసిన వాటిని ఏర్చి కూర్చి ఒక పద్ధతి ప్రకారం పెట్టుకోవడం జర్గింది. అంతే కాకుండా ఇంకెన్నో విషయాలను వివిధ రచనల నుండి, వివిధ సందర్భాలలో సేకరించడం వాటిని వివిధ రూపాలలో పెట్టడం జర్గింది. ఇలాంటి సేకరణలను పుస్తక రూపంలో తీసుకొస్తే బాగుంటుందని నా, స్నేహితులు, శ్రేయోభిలాషులు ప్రోత్సహించడం వలన ఈ పుస్తకానికి రూపం ఇవ్వడం జర్గింది. వేదాన్ని అర్థం చేయించడానికి ప్రయత్నించిన చాలా మందిలో మహోన్నత వ్యక్తి ఐన డా. దాశరథి రంగాచార్యులు ఒకరు. వీరు వేదాలను సులభ వచనంలో వ్రాసి సామాన్య జనులకు అందించడం విశేషం.వేదాలనే కాక మరెన్నో అద్భుత రచనలు చేసిన డా. దాశరథి రంగాచార్య గారి యొక్క దర్శన భాగ్యం కలగడం వారితో ఎన్నో విషయాలు చర్చించడం, వారి ద్వార అనేక విషయాలు నేర్చు కోవడం నా జన్మలో మరపురాని మధురమైన క్షణాలు. నేను వారిని కోరగానే వారు నా ఈ పుస్తకానికి వారి అమూల్యమైన ముందు మాటను వ్రాయడం నా అదృష్టంగా భావిస్తాను. వారి పుస్తకాల నుండి మధురమైన వాక్యాలను తీసుకొని క్రోడికరించినవి ఈ పుస్తకంలో చదివితే అవి ఎంత విలువైనవో మీకే తెలుస్తుంది. ఒక యోగి ప్రస్థానం రచయిత ప్రపంచప్రఖ్యాతి గాంచిన కెనడ దేశస్థుడైన రాబిన్ ఎస్.శర్మను నేను కల్వడం వారియొక్క అమూల్యమైన వ్యాఖ్యానాన్ని నేను వినడం నా అదృష్టంగా భావిస్తాను. వారి రచన నుండి అమృత వాక్యాలు మన జీవితానికి ఎంతగా ఉపయోగపడుతాయో ఈ పుస్తకం చదివితే మీకే తెలుస్తుంది. అంతే కాక ఎ.పి.జె. అబ్దుల్ కలాం గారి ఒక విజేత ఆత్మ కథ నుండి సేకరించిన విషయాలే కాక ఇతర అన్ని శీర్షికలు నేను అపురూపమైనవిగా భావిస్తాను. చదివి ఆనందించండి. ఇందులో అక్షర దోషములను గాని ఇతర దోషములను గాని మా దృష్టికి తెస్తే తరువాతి ముద్రణలో సవరించగలము.