
JEEVANA MAITRI
₹120
In stock · 7 available
PublisherSWAMY MYTREYA
LanguageTelugu
సర్వే భవంతు "మిత్రాణి” ప్రపంచం సాంకేతికపరంగా ఎంతో అభివృద్ధి చెందింది. మనిషి శాస్త్ర జ్ఞానంతో ఎంతో పురోగమించాడు. భౌతిక సుఖ జీవనానికి ఎన్నో సులభమార్గాలను కనుగొన్నాడు. ప్రకృతినీ, ప్రపంచాన్నీ తన గుప్పిట్లో ఉంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కృత్రిమంగా గాలి, నీరు, నిప్పు సృష్టించాడు. జీవ కణాలనీ, అవయవాలను కూడా కృత్రిమంగా సృష్టించగలుగుతున్నాడు. మరి ఇంత పురోగతి సాధించిన మానవుడు సుఖంగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడా? ఇన్ని సదుపాయాలు అమర్చుకున్నా ఆనందంగా ఎందుకు జీవించలేకపోతున్నాడు? మనిషి జీవితం సమస్యల వలయంగా ఎందుకు మారిపోయింది? తల్లిదండ్రులకు పిల్లలతో, భార్యకు భర్తతో, కోడలికి అత్త మామలతో, ఉద్యోగికి సహోద్యోగులతో, పై అధికారులతో, క్రింది పనివారితో, విద్యార్థికి ఉపాధ్యాయులతో, ప్రక్క ఇంటివారితో, ప్రక్క వీధివారితో, ప్రక్క దేశం వారితో సమస్యలు. మనిషితో మనిషికి సమస్యలు, మనలో మనకు సమస్యలు. జీవితంతో, జీవనంలో సమస్యలు. ఎవరిని చూసినా సమస్యలే. సమాధానం లేని సమస్యలు, నిరాశ, నిస్పృహ, నిర్వేదం, నిస్సహాయత, నిస్సత్తువ. చిన్నవాడినుండి పెద్దవాడి వరకు ప్రతి మనిషీ ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటున్నాడు. ఏదో అసంతృప్తి...