
JEEVANA MUKTHI
₹120
In stock · 12 available
PublisherSWAMY MYTREYA
LanguageTelugu
స్వామి మైత్రేయ సాధన - జీవన ముక్తి ప్రకృతిలో ఏదీ శాశ్వతంగా ఉండదు. ప్రతిదీ నిరంతరం మార్పు చెందుతూనే ఉంటుంది. అదే దాని సహజ స్థితి. ఆ ప్రకృతిలో భాగమైన మానవునిలో కూడా ప్రతీ క్షణం కోట్లకొద్దీ కణాలు పుడుతూ ఉంటాయి. నశిస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు ప్రాపంచిక జీవితంలో దేనితోనూ అంటిపెట్టుకోవడం అనవసరం అనే విషయం కూడా తెలిసిపోతుంది. ఏ క్షణానికా క్షణం అలాగే ఉంటుంది. వేరొకలా ఉండే అవకాశమే లేనప్పుడు, వేరేలా ఉండాలని కోరుకోవడం సరైనది కాదు కదా! అలా కోరుకోవడానికి (కోరిక ఉదయించడానికి) కారణం మనలోని 'అవిద్య' - తెలియనితనం సత్యమేమిటో తెలియనితనమే. ఏ క్షణానికా క్షణం అలా ఉండడమే సత్యం. ప్రపంచంలో అంతకు మించిన సత్యం మరొకటి లేదు. అటువంటప్పుడు ప్రతీక్షణం స్థిత ప్రజ్ఞతతో సంపూర్ణంగా జీవిస్తూ, చేసే పనిలో పూర్తిగా లీనమై ఫలాపేక్ష రహితంగా చేసినప్పుడు చేసిన పనిలో సంతృప్తితోపాటు సాఫల్యం కూడా లభిస్తుంది. కానీ, అలా చేయలేకపోతున్నాం. అందుకు కారణం మనస్సు. అది మనల్ని ఉన్నచోట ఉండనివ్వదు. అది దాని సహజ లక్షణం. మరి అలాంటప్పుడు మనం అనుసరించ వలసిన మార్గం ఏమిటి? అన్న ప్రశ్నకు గురూజీ స్వామి మైత్రేయ ప్రవేశ పెట్టి వ్యాప్తిలోకి తీసుకు వచ్చిన 'స్వామి మైత్రేయ సాధన' అనే జీవన శైలి జవాబుగా నిలుస్తుంది. తమ 21 మంది గురువుల వద్ద అభ్యసించిన అనేక పద్ధతులను, ప్రపంచ వ్యాప్తి చెందిన అనేక మత ప్రవక్తల, ద్రష్టల బోధనలను మేళవించి 35 సంవత్సరాల నిరంతర సాధనలో, తమ స్వానుభవంతో ఒక క్రొత్త జీవన విధానాన్ని వెలికి తీసుకు వచ్చారు గురూజీ స్వామి మైత్రేయ. అదే 'స్వామి మైత్రేయ సాధన' పద్ధతి.