
JEEVANA REKHALU
₹125
In stock · 1 available
PublisherSURYA PRACHURANALU
LanguageTelugu
ఇంటర్వ్యూల కథా కమామీషు ఇంతకాలానికి "జీవనరేఖలు" పేరిట ఈ ఇంటర్వ్యూల సంకలనం వెలువరిస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. వీటిని గురించి క్లుప్తంగానైనా కొంచెం వివరిస్తే తప్ప నాకు తృప్తిగా ఉండదు. 1996 ఆరంభంలో ఉద్యోగరీత్యా దేశరాజధాని ఢిల్లీ వెళ్లడం జీవితంలో మరచిపోలేని సంఘటన. వెళ్ళిన కొద్దిరోజులకే అక్కడి ప్రముఖ సాహితీవేత్తలు శ్రీయుతులు డా॥ ఇలపావులూరి పాండురంగరావు, డా॥ వేమరాజు భానుమూర్తి, డా॥ వి.వి.బి. రామారావు, డా|| వాడ్రేవు రంగరావు, డా.జె. భాగ్యలక్ష్మి, డా॥ జె. లక్ష్మీరెడ్డి, డా|| ఆర్.ఎ. పద్మనాభరావు, శ్రీ భట్టిప్రోలు కృష్ణమూర్తి, శ్రీ శిష్ ట్లా లక్ష్మీపతిశాస్త్రి గార్లతో పరిచయ భాగ్యం కలిగింది. సాహితీ మిత్రులు డా॥ టి. సంపత్ కుమార్, డా॥ ఏల్చూరి మురళీధరరావు, డా॥ కల్లూరి శ్యామల, డా|| మెడికోశ్యాం, డా|| ఎ. ఆంజనేయులు, డా॥ రాజేశ్వరి; శ్రీయుతులు ఆర్.యస్. గణేశ్వరరావు, తోలేటి జగన్మోహనరావు, దాసరి అమరేంద్ర, గిడుగు రాజేశ్వరరావు, పూర్ణకుమార్దాస్, కొండా కోటిరెడ్డి, ఎ. కృష్ణారావు, డి. సుబ్రహ్మణ్యం, తిలక్, ఆంజనేయశర్మ, చంద్రశేఖర్, కందుకూరి సూర్యనారాయణ, విశ్వనాథరావు, ఎన్బీటీగురవయ్య, సాహిత్య అకాడమీ శ్రీనివాసరావు; శ్రీమతులు ఉషారాణి భాటియా, కందుకూరి వెంకట మహాలక్ష్మి, శాంతాసుందరి, వసంతలక్ష్మి, సుజాత, విజయామూర్తి, ప్రభల జానకి; కళాకారులు డా|| రాజారెడ్డి, శ్రీ ఏడిద గోపాలరావు, శ్రీ ఆర్. విద్యాసాగర్‌రావు ప్రభృతులను సాహిత్య సమావేశాలలో కలుసుకొని ముచ్చటించడం అపూర్వావకాశం. వాళ్ల ఆతిథ్యం, స్నేహం-మరచిపోలేనివి. ఢిల్లీ తెలుగు అకాడమీ, ఢిల్లీ తెలుగు సంఘం చూపిన ఆదరణా మరచిపోలేనిదే. నెలకో రెండునెలలకో "ఢిల్లీ సాహితీమిత్రబృందం" ఏర్పాటు చేసే గృహసమావేశాల్లో జరిగే సాహితీ చర్చలవల్ల, సాహిత్య అకాడమీ సమావేశాలకు ఆహ్వానితునిగా వెళ్ళడం వల్ల, 'తెలుగు సాహితి' అప్పుడప్పుడూ ఆంధ్రదేశం నుంచి అతిథులుగా వచ్చే మన రచయితల గౌరవార్థం ఏర్పాటు చేసే ఇష్టాగోష్ఠి సభలలో పాల్గొనడం వల్లనూ జనారణ్యంలో ఉన్నానన్న సంగతి మరచిపోగలిగాను. ఆ సభల్లోనే ఆంధ్రదేశంలోని ప్రసిద్ధ సాహితీవేత్తలెందరినో ఢిల్లీలోనే తొలిసారి కలుసుకొనే అవకాశం కలుగడం విశేషం. అక్కడి మరచిపోలేని మరో సంఘటన 'ఆంధ్రా అసోసియేషన్' తో అనుబంధం.