JEEVANA SAMARAM - 70 by G.PARAMESHWAR Telugu book cover

JEEVANA SAMARAM - 70

by G.PARAMESHWAR

₹70
In stock · 12 available
PublisherG.PARAMESHWAR
LanguageTelugu
నా మాట అనుసృజన, అనువాదం రెండు భాషల మధ్య వారధి లాంటిది. అనువాద ప్రక్రియ భారతదేశములో అతిప్రాచీనమైనది. భారతీయ భాషలన్నింటికి దేవభాష సంస్కృత భాషయే మూలం. ప్రాంతాలవారిగా జనులలో ఎన్నో భాషలు మాండలికాలు ఉన్నప్పటికి లిఖిత సాహిత్యం ముందుగా సంస్కృత భాషలోనే సృజింపబడినది. అటనుండి సాహిత్యం అన్ని భారతీయ భాషలలోకి అనువదింపబడినది. సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించి నన్నయ, తిక్కన, ఎఱ్ఱాప్రగడలు తెలగులో అనువాద ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నన్నయ కాలమునుండి నేటి వరకు సంస్కృత, బెంగాలీ, ఆంగ్ల భాషలతో సహ ఎన్నో భారతీయ భాషల సాహిత్యం తెలుగులోకి అనువదింపబడినది. ఇతర భాషలనుండి మన భాషలోకి సాహిత్యం అనువదింపబడుట తెలగు సాహిత్యం ఇతర భాషల్లోకి అనువదింపబడుట ద్వారా అన్ని భాషల సాహిత్యం, సంస్కృతి, ఆలోచనా విధానం, శైలీ, సామాజిక జీవితానికి హృదయాలు స్పందించే పద్ధతి, అదే విధంగా ఇతర భాషల వైశిష్ట్యాన్ని తెలుసుకునే సంప్రదాయాన్ని నిలబెట్టే బాధ్యతని ఈ అనువాద ప్రక్రియ నిరంతరం సాగిస్తూ ఉంటుంది. అందువల్లనే శ్రీ ఎమ్ రంగయ్యగారు, మధ్యప్రదేశికి చెందిన ప్రసిద్ద లఘుకథా రచయిత సతీష్ దుబే గారి, సుమారు యేడెనిమిదివందల కథల నుండి కొన్నింటిని తెలుగులోకి అనువదింపమని అన్నప్పుడు ఒక వంద కథలకు అనువాదం చేస్తానని చెప్పి 102 కథలను తెలుగులోకి అనువదించి పాఠకులకు సమర్పిస్తున్నాను. సమాజములోని క్రియా ప్రతిక్రియలను చూసి, సతీష్ దుబేగారు దానికి స్పందించి, దానిని కథా రూపంలో మన ముందుంచారు. తెలుగు భాషాంతరీకరణద్వారా వాటిని ఆస్వాదించే అవకాశం కలిగించడంలో నా చిన్ని ప్రయత్నమే ఈ 'జీవన సమరం'. తన కథలని తెలుగులోకి అనువదించడానికి అనుమతినిచ్చిన శ్రీ సతీష్ దుబేగారికి, ఆ అవకాశాన్ని నాకే ఇప్పించి ఈ కృతికి పీఠికను వ్రాసిపెట్టిన శ్రీ రంగయ్యగారికి, మొదటి పరిచయమే ఐనా ఎంతో స్నేహభావంతో 'చిన్నకథలు గొప్ప సందేశాలు' సందేశాన్ని వ్రాసిపెట్టిన, ప్రొఫెసర్ మనస చెప్పన్నగారికి, కవర్ డిజైన్ చేసిన చిరంజీవి సునయన మరియు ఎంతో ఆకర్షణీయంగా ముద్రణ కార్యాన్ని నిర్వహించిన కర్షక్ ప్రింటర్స్క నా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు.