JEEVANA SANDHYA - KATHALU by SHAIK AHAMED BASHA Telugu book cover

JEEVANA SANDHYA - KATHALU

by SHAIK AHAMED BASHA

₹75
In stock · 2 available
PublisherMALLETEEGA MUDRANALU
LanguageTelugu
మా మాట శ్రీ షేక్ అహమద్ బాషాగారు, సాహిత్యాభిమాన ప్రకృతి ప్రేమికులు. రైల్వేలో స్టేషన్ మేనేజరుగా ఛీఫ్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా, ఉద్యోగ బాధ్యతలలో ఎటువంటి రిమార్కు లేకుండా, 2010వ సం॥ రిటైర్ అయ్యారు. పదవీ విరమణ తర్వాత ఆయనకు ఇష్టమైన సాహిత్యం మీద మక్కువతో కవిత్వం, కథలు, నవలలు వ్రాయడం మొదలు పెట్టారు. ప్రముఖ పత్రికలైన చతుర, విపుల, నవ్య వీక్లీలలో, ఆదివారం అనుబంధంలో వారు వ్రాసిన కథలు వచ్చాయి. విశాలాంధ్ర పబ్లికేషన్స్ వారు ఆయన నవల కిడ్నాప్ ప్రాణం వున్నంతవరకు విడుదల చేశారు. "కిడ్నాప్" నవలను ఇంగ్లీషులోకి అనువదించి "Operation Seshachalam" అని Nation Press ద్వారా విడుదల చేశారు. వార్తా పత్రికలు Hindu, ప్రసిద్ధులైన జిడ్డు కృష్ణమూర్తి, వివేకానంద జీవిత చరిత్రలు డా॥ హెగ్దే ప్రసంగాలు చాలా యిష్టం. తన కుటుంబ సభ్యులతోనే కాక ఇరుగు, పొరుగుతో సంఖ్యంగా వుండి, వారికి మంచి, చెడుల గురించి వారడిగితేనే సలహాలు చెప్పేవారు. ముక్కుసూటి మనిషి, మనసులో మాటలు ధైర్యంగా చెప్పేవారు. పక్షులతో, చెట్లతో మాట్లాడుతుండే వారు. దేశం గురించి, పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించేవారు. ఆయనకు కుటుంబమే బలం. పిల్లలు, మనుమలు, మనుమరాండ్రు అంటే వాళ్ళకు యిష్టమున్నా, లేకున్నా మంచి చెడుల గురించి చెప్తూండేవారు. వారి గురించి ఆయన సన్నిహితులైన మదనపల్లికి చెందిన శ్రీ అహమద్ బాషా గారు వ్రాసిన మాటలు.