JEEVANA SHILPAM by KANNEGANTI ANASUYA Telugu book cover

JEEVANA SHILPAM

by KANNEGANTI ANASUYA

₹100
In stock · 11 available
PublisherKANNEGANTI ANASUYA
LanguageTelugu
పడమటి సంధ్యారాగం ఓ గంట పర్మిషన్ లెటరు పడేసి పడుతూ లేస్తూ హడావిడిగా స్టేషన్కి వచ్చేసరికి ట్రైన్ అరగంట లేటని చల్లగా చెప్పాడు బుకింగ్ క్లర్కు ఉసూరుమంటూ చేతిలో బ్యాగ్ కిందపెట్టి కర్చీఫ్ ముఖం తుడుచుకుంటూ నిలబడ్డాను చేసేదేం లేక. మూడు పర్మిషన్లు తీసుకుంటే ఒక కేజువల్ లీవుగా పరిగణిస్తారనే భయంతో చాలా అరుదుగా ఎంతో పనుంటే తప్ప పర్మిషన్ జోలికి పోను. చ... చ... అనవసరంగా ఒక పర్మిషన్ వృధా అయింది. కాలేజీ వదిలిన తర్వాత వచ్చినా బండి దొరికేదే... అనవసరంగా కంగారు పడ్డాను. స్టేషన్కి ఫోన్ చేసి తెలుసుకున్నా సరిపోయేది. ఎందుకు తట్టలేదో తనకి... సర్లే... ఏం... చేస్తాం... అని మనసులో అనుకుని కౌంటర్ దగ్గరికి పోయి టికెట్ తీయబోయే దాన్నల్లా... ఎనౌన్స్ చేసిన తర్వాతే తీద్దాం లెమ్మని లేడీస్ వెయిటింగ్ రూంవైపు అడుగులు వేశాను. ఎప్పటిలాగానే మూసే ఉంది. ఎక్కడా కూర్చునే స్థలమే లేదు. బండి లేటవటంతో ప్లాట్ ఫాం నిండా జనం కిటకిటలాడుతున్నారు. టైం చూశాను. అయిదూ పదిహేన్నిమిషాలు. ఇంకో అరగంట దాకా బండి వచ్చే ఛాయల్లేవు. చెప్పిన ఆలస్యానికి బండి వస్తే రాజమండ్రి చేరుకునే సరికి తొమ్మిదిన్నర కావచ్చు. ఆకలి కరకరమంటూంటే తినటానికేమయినా దొరుకుతాయేమో నని చుట్టూ కలియచూశాను. ఊహుఁ... దొరికితే అది పవర్పేట స్టేషనెందుకవుతుంది. ఏళ్ళకి ళ్ళు గడిచిపోతున్నా ఈ స్టేషన్ తీరూ తెన్నూ మారదు. ఇక ఇంతే... దూరంగా ఒక మూలన సరుకులు మోసే ట్రాలీ కనపడితే అటుగా అడుగులు చేశాను కూర్చుందామని. ఉన్నట్టుండి...